పుట:Naajeevitayatrat021599mbp.pdf/750

ఈ పుట ఆమోదించబడ్డది

గవర్నరును రాజాజీ తాము ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కోరారు. ఆ కోరిక ఫైలు రూపంలో గవర్నరు దగ్గరికి వెళ్ళింది. గవర్నరు దానిపైన, "నేను ఈ భవనము, ఆవరణ ఏదీ ప్రభుత్వానికి అప్పగింపదలచుకోలేదు. దీనికింత ఫైలు ఎందుకు పెంచారు?" అని వ్రాశారు. దాంతో ఆ ప్రసక్తి అప్పుడే వదలుకున్నారు.

ఎనిమిది, తొమ్మిది సంవత్సరాల తర్వాత, ప్రకాశంగారు ముఖ్యమంత్రి అయినపుడు, అప్పటి గవర్నరు 'నై' గారితో ఆ ఆవరణ అంతా ప్రభుత్వానికి అప్పజెప్పవలసిందని చెప్పారు. అ రోజున గవర్నరుగారికి - ప్రకాశంగారు, వారితోబాటుగా నేను - ఫోర్టులోని సచివాలయం, శాసన సభ ఎంత ఇరుకుగా ఉన్నవో చూపించి, మౌంటురోడ్డు భవనంలోకి వెళ్లాము. గవర్నరుకు బంగళా అన్ని అంతస్తులు చూపించాము.

విందుల హాలు ప్రస్తుతం గవర్నరుగారికి ఏమీ ఉపయోగం లేకుండా ఉన్నదనీ, ప్రభుత్వానికి అనేక విధాలుగా ఉపయోగకరం అవుతుందనీ చూపించాము. ఇంతేగాక, శాసన సభ్యుల వసతి సౌకర్యాలకు గల ఇబ్బందులను గూడా చెప్పాము. ఆయన ఆలోచించుకొనడానికి రెండు, మూడు రోజులు వ్యవధి కోరారు.

తరువాత ఆయన, "వాడుకొనేందుకైతే ఇస్తాము. మీ ప్రభుత్వపు ఆస్తి క్రిందకు ఎందుకు ఇవ్వా"లని ఒక ప్రశ్న లేవదీశారు. అప్పుడు, "అ విధంగా మేము వాడుకొంటే మరమ్మత్తులు వగయిరా ఖర్చులు గవర్నరు అకౌంటులోనే పెట్టుకొంటారా?" అని ప్రశ్నించాము. "వాడుక మీది, ఖర్చు నాది - ఎలా కుదురుతుంది?" అని ఆయన ప్రశ్నించారు.

"హక్కు గవర్నరు దయితే ప్రభుత్వంవారు మరమ్మత్తుల కెందు కంత ఖర్చుపెట్టాలి? అందులో క్రొత్త భవనాలు కట్టుకోవచ్చా, కూడదా? ఇంతకూ గిండీలో ఉండే గవర్నరుగారు పది మైళ్ళ దూరాన, తనకు వాడుకకు అక్కరకురాని మౌంటురోడ్డు భవనంపై ఎందుకు ఖర్చు పెట్టాలి? అపుడు, గవర్నరు కిచ్చే అలాట్‌మెంటు ఈ ఖర్చులు