పుట:Naajeevitayatrat021599mbp.pdf/672

ఈ పుట ఆమోదించబడ్డది

మంది ఉద్యోగాలకోసం చెన్నపట్నంవచ్చి స్థిరపడడం జరిగింది. ఇది ఇలాఉండగా, మౌంటు రోడ్డుకు ఇరుప్రక్కల ఉన్న తెలుగు భూస్వాములు, జమీందారులు తమ భవనాలను, ఆవరణలను అమ్మివేసుకొనడం మొదలు పెట్టారు. ఈ విధంగా జరిగి జరిగి, 1937 నాటికి పట్నంలో తెలుగువారి జనాభా తగ్గనారంభించింది.

చెన్నరాష్ట్రంలో, చెన్నపట్నంలో నూటికి 25 వంతులైనా, అంటే మూడు, నాలుగు లక్షలమందైనా ఆంధ్రులు ఉండేవారు. అలాగునే మిగిలిన దక్షిణజిల్లాలలో నూటికి 15 వంతులు ఆంధ్రులే ఉండేవారు. అందుచేత కోస్తా జిల్లాలలోను, రాయలసీమ జల్లాలలోను ఉన్న ఆంధ్రులే వీరి మద్దతుతో చెన్నరాష్ట్రం పరిపాలన తమ చేతులలో ఎప్పుడూ ఉంచు కోవలసింది. కాని, ఏ కారణంచేతనో ఆంధ్రులు వే రయితేనే అభివృద్ధిపొందే అవకాశం ఉందిగాని, ఉమ్మడి రాష్ట్రంలో మనం సగంపాలు ఉన్నా మనకు తగు అవకాశాలు లేవు; మన ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధికావడానికీ అవకాశాలు లేవు - అన్నభావం మన తెలుగు నాయకులలో గట్టిగా ఏర్పడింది. బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలు ప్రత్యేకంగా విభజించగానే ఈ భావం గట్టిపడింది. మనకు ఉత్తరంగాఉన్న ఒరిస్సావారు బీహారునుంచి విడిగా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన చేసేవారు. బొంబాయిలో, సింధు చిన్న భాగంగా ఉండేది. అందుచేత ఆ ప్రజలు తమకు విడి రాష్ట్రం కావాలని ఆందోళన మొదలుపెట్టారు. ఆంధ్రరాష్ట్రం కావాలా వద్దా అన్న ప్రశ్న తెలుగునాయకులను అయిదారేండ్లపాటు వేధించింది. మండలా భివృద్ధికై కొన్ని మండల సభ లేర్పరచడం, తర్వాత అన్ని మండలాల సభలు కలిసి ఏకంగానే పెద్ద ఆంధ్రసభ కావాలనే వాంఛ వెలిబుచ్చేసరికి, మొదట అఖిలాంధ్ర సభ ఒకటి 1912 లో ఏర్పాటయింది. అందులో మొదటి ఎజెండాలో ఆంధ్రరాష్ట్రం ప్రత్యేకపరచాలన్న విషయం లేదు. కాని, దేశబాహుళ్యంలో ప్రత్యేకాంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయక తప్పదన్న వాతావరణం బలపడింది. ప్రకాశంగారు మొదట ఈ విషయమై సందిగ్ధంగా ఉన్నా, 1913 లో బాపట్లలో సమావేశమయిన మొదటి