పుట:Naajeevitayatrat021599mbp.pdf/614

ఈ పుట ఆమోదించబడ్డది

మటుకు ప్రభుత్వాన్ని నదీస్వామి అన్నారు. ఒక ప్రక్క ఒకరు, రెండవ ప్రక్క ఇంకొకరు భూస్వాములైతే నదీ గర్భంలో వారిరువురికి చెరి సగం స్వామిత్వం కలుగుతుందన్నారు.

మాట వరసకేమో - సేద్యపు హక్కులకు భంగం రాకుండా పైన చెప్పిన నదీస్వాములు నదులపైన వారికి కావలసిన కట్టడాలు కట్టుకోవచ్చన్నారు. అయితే, న్యాయశాస్త్ర ప్రకారం ఈ కట్టడాలు కట్టేముందు క్రిందా మీదా ఉన్న నదీస్వాముల అనుమతి పొందాలి. ఆ పొందడంలోనే కష్టాలన్నీ ఉండేవి. ఒకరికొకరు అనుమతించడానికి సంవత్సరాలు పట్టేది. ఒక్కొక్కప్పుడు ఎన్ని ఏళ్ళయినా అట్టి అనుమతి వచ్చేది కాదు.

"ఈ విషయంలో ప్రభుత్వంవారు, జమీందారు, ఇనాముదారు - ఒకరి కొకరు తీసిపోకుండా ఉండేవారు. ఈ అనుభవం నాకు స్వయంగా కలిగింది. అందుచేత, నీటి సరఫరాపై గల హక్కులు సంపూర్ణంగా శాసనం ద్వారా ప్రభుత్వం తీసుకొంటేనే భూములకు, రైతులకు మేలు జరుగుతుంది. పెర్మనెంటు సెటిల్‌మెంటు శాసనాలలో నీటి హక్కు జమీందారులకు సంక్రమింపజేయలేదు. సంక్రమింపజేసిన ఆ హక్కులు ప్రభుత్వం న్యాయరీత్యా తీసికొనే హక్కు సర్వదా ఉన్నది."

ఈ విషయాలన్నీ నేను ప్రకాశంగారికి చెప్పగా, ఆయన దాని కొక బిల్లు తయారు చేయవలసిందని చెప్పారు. బిల్లు డ్రాప్ట్ తయారీ మొదలు పెట్టేసరికి అనేక న్యాయ సందేహాలను (లా పాయింట్లు) లేవదీశారు. ఇవన్నీ మొత్తం పైన చేయాలన్నారు. దీని కొక కమిటీవేసి, దాని సిపార్సుపై నడిస్తే బాగుంటుందన్నారు. రెవిన్యూ శాఖకు అప్పుడు సెక్రటరీ రామున్ని మేనోన్ అనే ఐ. సి. యస్. ఉద్యోగి - కమిటీ అనగానే ఆలస్యం తప్పదు.

అయితేనేమిగాని, ఒక కమిటీ వేయడానికి ప్రకాశంగారు ఒప్పుకొన్నారు. ఆ కమిటీకి ప్రశ్నావళి ఏర్పాటుచేసే విషయమై అనేక న్యాయ సమస్యలు సముద్ర తరంగాలవలె ఉద్భవించినవి. దానికి కారణం దృష్టి భేదము. నేను చదువుకొన్నది హిందూ జ్యూరిస్