పుట:Naajeevitayatrat021599mbp.pdf/610

ఈ పుట ఆమోదించబడ్డది

ఉద్యోగికి ఉరిశిక్షలాంటిది (ఈ సమయంలో డిస్మిసల్) తప్పించేశారు. గవర్నరు ప్రకాశంగారి వాదానికి ముగ్ధుడయినాడు. ఉద్యోగికి శిక్ష అంటూ పైకి కనిపించేటట్టూ పనిచేయకుండానే, పనిచేస్తే వచ్చే లాభాలన్నీ క్షణంలో కల్పించేశారు."

ఈ విధంగా అనేక శాఖలలో మంత్రుల క్రోధాలకు గురిఅయిన ఉద్యోగులు ప్రకాశంగారివల్ల రక్షణ పొందేవారు.

డిప్యూటి కలెక్టరుపై పాళీలచోరీ కేసు

ఒక సందర్భంలో నెల్లూరులో ఒక డిప్యూటీ కలెక్టరుకు ట్రెజరీ డ్యూటీలు కూడా ఉండేవి. ఒకసారి అతడు ఒక కష్టదశలోకి వచ్చాడు. అతని చేష్టలు కొంత వికృతంగా కనబడేవన్న మాట మాత్రం వాస్తవమే. అతనిపై కలెక్టరుగా ఉన్నది ఒక ముస్లిమ్. నెల్లూరు చెన్నపట్నానికి దగ్గర గనుక ఆ ముస్లిమ్ కలెక్టరు పనిఉన్నా లేకున్నా చెన్నపట్నం వెళ్ళి అక్కడ కాలక్షేపం చేస్తూండేవాడు. ఎందుకు వెళ్ళినదీ కారణం తెలపని ట్రావెలింగ్ ఎలవెన్స్ బిల్లులు మాత్రం వస్తూండేవి. ఈ ట్రెజరీ డిప్యూటీ కలెక్టరు తన తాహతు తెలీక వాటిని పాస్ చేయడానికి వీలులేదని అడ్డుపడ్డాడు. అందుచేత ఇద్దరికీ పైకి చెప్పుకోలేని తగాదా ఒకటి ఏర్పడింది. వెంటనే కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు నిబంధనలు ఒప్పుకొన్న దానికన్న హెచ్చుగా కలం పాళీలు, ఒకటో రెండో పెన్సిళ్ళూ మొదలైనవి న్యాయవిరుద్దంగా తన ఇంటికి తీసుకుపోయి వాడు కొన్నాడనీ, అందుచేత అతనిని ఎందుకు శిక్షించగూడదో సంజాయిషీ ఇవ్వాలనీ నోటీసు జారీ చేయించాడు. డిప్యూటి కలెక్టరు, కలెక్టరు ఆఫీసుకు తెలియకుండా రాత్రికి రాత్రే బయలుదేరి చెన్నపట్నం వచ్చి, మేము ఆఫీసుకు వెళ్ళేసరికి, సరిగా వచ్చి ప్రకాశంగారి ఆఫీసుగదిలో సిద్దమయినాడు. ఇదీ అతడు చెప్పుకున్న సంజాయిషీ: కొన్ని ఏండ్ల క్రిందట ప్రకాశంగారి కాంగ్రెసు పర్యటనలో అతడు ఆయనకు ఎలాగో పరిచయమైనవాడు. ఆ చనువు చేత బంట్రోతుకు నచ్చజెప్పి లోపలికి వచ్చి మఠం వేశాడు. ప్రకాశంగారు నేను