పుట:Naajeevitayatrat021599mbp.pdf/605

ఈ పుట ఆమోదించబడ్డది

లను ప్రదర్శింపరాదని బొంబాయి, చెన్నరాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించినవి.

చెన్నరాష్ట్రంలో కాంగ్రెసు మంత్రివర్గం ఏర్పాటైన రెండు నెలలలో ఆ ఆంక్షలు తొలగించారు. ఆ విధంగా ఆంక్షలు తొలగింపబడిన చిత్రాల పేర్లు ఇవి:

శారదా ఫిల్మ్ కంపెనీవారు నిర్మించిన, "మహాత్మా గాంధీగారి స్వాతంత్ర్యయాత్ర"; కృష్ణా ఫిల్మ్ కంపెనీవారి "మహాత్మా గాంధీజీ చారిత్రకయాత్ర"; రంజిత్ ఫిల్మ్‌ కంపెనీవారి "మహాత్మా గాంధీ యాత్ర"; పై కంపెనీవారే నిర్మించిన "దేశభక్తుడు"; పయొనీర్ ఫిల్మ్ కంపెనీవారి "పటేలు యాత్ర"; అమెరికన్ ఫిల్మ్ కంపెనీవారి "దేశభక్తుడు; "మహాత్మా గాంధీకి బాంబే స్వాగతము"; కృష్ణా ఫిల్మ్ కంపెనీవారి "మహాత్మా గాంధీజీ పునర్జన్మము"; "మహాత్మా గాంధీ ఇంగ్లండునుంచి పునరాగమనము" (నిర్మాత: బిల్లి మోరియా); సినిమాటోగ్రాఫ్ సౌండ్ న్యూస్ ఫిల్మ్"గాంధీజీ చక్రవర్తిని సందర్శించుట"; శ్రీకృష్ణా ఫిల్మ్‌కంపెనీ వారి "అమర ప్రభ" (ఇమ్మోర్టల్ గ్లోరీ)' "జితేంద్రదాసు యాత్ర"; "వసంత బంగాళీ."

ఈ పై ఫిల్ములమీద ఉన్న ఆంక్ష జి. ఓ. నంబరు 3672 (హోమ్ 29 - 1937) మూలంగా రద్దు చేయడమైనది.

లెప్టినెంట్ కర్నల్ శాస్త్రి విషయము

ప్రకాశంగారు మంత్రిగా ఉన్న సమయంలో కష్టంలో ఉన్న వారందరూ ఆయనను తమ ఆపద్బాంధవునిగా చూచుకొనేవారు. తన శాఖకు చెందినా, చెందక పోయినా, ఆయన వచ్చినవారి ఆర్తిని హరించడానికి వీలయితే తగిన సహాయం చేసేవారు.

మంత్రుల క్రోధానికి గురి అయిన ఉద్యోగస్థులలో ఒకరు లెప్టినెంట్ కర్నల్ శాస్త్రి, ఐ. ఎం. ఎస్.

డాక్టర్ టి. ఎస్. ఎస్. రాజన్ వైద్యశాఖా మంత్రి అని ఇదివరలో చెప్పడమైనది. ఆయన తిరుచినాపల్లి వాస్తవ్యుడు. ఆయనకు,