పుట:Naajeevitayatrat021599mbp.pdf/597

ఈ పుట ఆమోదించబడ్డది

577

నాజీవిత యాత్ర-4


యువకుడైన బెజవాడ గోపాలరెడ్డిగారి పేరును సూచించారు. గోపాల రెడ్డి యువకుడు, చురుకైనవాడు, త్యాగశీలుడు. రాజాజీ ఆ పేరు ఒప్పుకొనడం జరిగింది.

మిగిలిన మంత్రులలో రామున్ని మేనోన్ కేరళనుంచి వచ్చిన ఆయన. ప్రకాశం గారు మాప్లా తిరుగుబాటు సందర్భంలో మలబారు పర్యటన చేసిననాటినుంచి ఈయనకు పరిచితులు. మిగిలిన మంత్రులలో డాక్టర్ సుబ్బరాయన్, మునుస్వామిపిళ్లైగార్లు21వఉద్యమంలో కాని, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో గాని కాంగ్రెస్ వారితో బాటు జైలుకి వెళ్లినవారు కారు. డాక్టర్ టి.ఎస్. రాజన్ పూర్వకాలపు విప్లవవాసన కలవాడు.ఏ మంత్రికి ఏ శాఖలు ఇవ్వాలో నిర్ణయించే భారం అంతా రాజగోపాలాచారిగారికే విడిచి పెట్టడమైయింది.

ప్రకాశంగారికి రెవిన్యూ శాఖ ఇచ్చారు. కాని, రెవిన్యూమంత్రికి జిల్లా కలక్టర్లను నియమించడానికిగానీ బదిలీచేయడానికిగాని అప్పుడున్న ప్రభుత్వ నిబంధనలప్రకారం అధికారం లేదు. ఆ విధంగానే, బోర్డ్ ఆఫ్ రెవిన్యూ-రెవిన్యూశాఖలోనిదే అయినా మెంబర్లంతా ఐ.సి.యస్.వారు కావడంచేత వారిని నియమించడానికిగాని, మార్చడానికిగాని రెవిన్యూమంత్రికి హక్కులేదు అయినా రెవిన్యూశాఖ అనేసరికి ప్రభుత్వానికి వెన్నెముక వంటిదనే ప్రథ ఒకటి ఉండేది. గ్రామోద్యోగులు, తహశీల్దారులు- వీరందరూ బోర్డ్ ఆఫ్ రెవిన్యూఖాయిదాలోనే పనిచేస్తారు. బోర్డ్ ఆఫ్ రెవిన్యూకి శాసనరీత్యా, అనేక వ్యవహారాలలో మంత్రివర్గం ప్రమేయంలోకుండా తుది నిర్ణయాలు తీసుకునే హక్కుంది. అలాగుననే కోర్టువార్డ్సు(ప్రతిపాలక అధికరణ) బోర్డ్ ఆఫ్ రెవిన్యూవారి చేతిలోనే ఉండెను.డెప్యూటి కలెక్టర్ల నియామకె, బదిలీల సంబంధమైన తుది నిర్ణయం మాత్రం రెవిన్యూమంత్రి చేతిలో ఉండేది. అయితే ఆ ఉద్యోగస్థులు కూడా శాసనరీత్యా అనేకమైన రెవిన్యూ విషయాలలో తమంతట తామే నిర్ణయాలు చేసుకోగలిగే హక్కు కలిగి ఉండేవారు. ఈ పరిమితులమధ్య ప్రకాశంగారు మంత్రిత్వం నడిపించుకోవాలి. అట్టే ఇబ్బంది ఎవ్వరికి కలుగజేయలేడని, అప్పుడున్న