పుట:Naajeevitayatrat021599mbp.pdf/596

ఈ పుట ఆమోదించబడ్డది

గారలు రాజాజీతో అదివరలో అనుకున్న సంగతి. అయితే, రాజాజీ మాత్రం, లేచి యిద్దరు డిప్యూటీ లీడర్లు వుండాలనీ, వారు - ప్రకాశం గారున్ను, వేదరత్నం పిళ్లైగారున్ను అని ఆ ఇద్దరిపేర్లు ప్రతిపాదించారు. సహజంగానే యీ రెండుపేర్లూ ఆమోదింపబడినాయి. అప్పటి నంచి సభ్యులలో ఆవేశం కొంత చల్లబడింది.

2

మంత్రివర్గంలో ప్రకాశంగారి స్థానము

మంత్రివర్గంలో ప్రకాశంగారు ఒకరయి ఉండాలా అన్న సందేహం కూడా కాంగ్రెస్ పెద్దలకు తోచినట్లు కనిపించింది. అందుచేత రాజాజీ మొదట ప్రకాశంగారిని అసెంబ్లీ స్పీకరుగా ఉండాలని కోరారు. ప్రకాశంగారు ఒప్పుకోలేదు. సాంబమూర్తిగారు కూడా మెత్తని వాడు కాడు. ప్రకాశంగారు మంత్రి అయితే, వారికితోడు సాంబమూర్తిగారు కూడా ఉన్నట్లయితే అసలు ముఖ్యమంత్రిగారి మాట మంత్రివర్గంలో చెల్లుతుందో, లేదో అన్న పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది. అందుచేత, సాంబమూర్తిగారిని స్పీకరుగా ఉంచినట్లయితే తగువు తీరు తుందని ఆయనను స్పీకరుగా ఉండాలని కోరారు. మహర్షి సాంబమూర్తిగారు అంగీకరించారు. తరువాత తెలుగు మంత్రులను ఎవరిని వేయాలి అని ఒక ప్రశ్న. నాకు తెలిసిన విషయం ఇది: గిరిగారి పేరు, కోటిరెడ్డిగారి పేరు ప్రకాశంగారు సూచించారు. గిరిగారి పేరు రాజాజీ వెంటనే అంగీకరించారు. కాని, కోటిరెడ్డిగారి పేరు అంగీకరించలేదు. కోటిరెడ్డిగారు రాయలసీమ కంతకూ పేరు ప్రఖ్యాతులు పొందిన సాత్విక నాయకులు. ఆయన సతీమణి అప్పటికే కడపజిల్లా బోర్డు అధ్యక్షురాలై, స్త్రీ అయినా మగతనం చూపిస్తున్న నాయకురాలు. అందుకే కాబోలు రాజాజీ రెడ్డిగారిని ఒప్పుకోలేదు. దానిపైన ప్రకాశంగారు కాంగ్రెసులో అనుభవంగల నాయకులను కాకుండా