పుట:Naajeevitayatrat021599mbp.pdf/547

ఈ పుట ఆమోదించబడ్డది

తాను బయట ఉండి సూర్యనారాయణ రావుని ఒక్కణ్ణే నాతో మాటలాడడానికి జెయిలులోకి పంపించిన కారణంగా, అటువంటి పరిస్థితి ఉత్పన్నమయింది. తానూ, సుబ్బారావూ వచ్చి అల్లా బయటే ఉండిపోక పోతే, అధమం తాను ఒక్కడయినా సూర్యనారాయణ రావుతోపాటు లోపలికివచ్చి, సంగతి సందర్భాలు క్షుణ్ణంగా చెప్పిఉంటే, ఈ చిక్కులలో మేము పడేవాళ్ళము కాము.

నాచేత ఆ రెండవ దస్తావేజు సరిగా ఉందని అనిపించు కోవడానికి తానువచ్చి నన్ను కలవవలసి వచ్చేసరికి కృపానిధి మానసికంగా చాలా బాధపడ్డాడు. కాని వెనకటికీ ఇప్పటికీ ఆతని పరిస్థితి అల్లాగే ఉండిపోయింది. అందుచేత, ఆ మొదటి ట్రాన్స్‌ఫర్ దస్తావేజు వ్రాయబడిన 15 రోజులు తిరక్కుండా, తప్పనిసరిగా నన్ను కలుసుకోక తప్పింది కాదు. ఈ ముసాయిదాలన్నీ ఆ ఇంటి యజమాని లాయర్లే తయారు చేశారు.

కృపానిధి నన్ను కలుసుకుని సూర్యనారాయణ రావు ఎల్లా మమ్మల్ని దగా చేసిందీ వివరించాడు, కంపెనీ తాలూకు ఇతర ఆస్తులన్నీ తనఖా పెడితేనే గాని ఒక్కకాణీ కూడా ఇవ్వనంటున్నాడని చెప్పాడు. నేను, అ ఆదివారంనాడు సూర్యనారాయణరావు ఒక్కడే లోపలికి వచ్చి నాతో మాట్లాడిన సందర్భంలో ఏం జరిగిందో, కృపానిధితో వివరంగా చెప్పాను. మనల్ని బాగా దగాచేశాడనీ, ఆనాడు సూర్యనారాయణరావుతో తానూ లోపలికి రాక పోవడాన్నే అతనికి అలాంటి అవకాశం కలిగిందనీ, అదే పెద్ద తప్పయిపోయిందనీ వివరించాను. నేను కృపానిధిని చివాట్లు పెట్టి, ఈ పరిస్థితులలో తనఖా దస్తావేజు వ్రాయడానికి సుతరామూ ఒప్పుకోనని చెప్పాను.

నా జీవితంలో ఎప్పుడూ ప్లీడరుగా, అడ్వకేటుగా, రాజకీయ వేత్తగా పనిచేసి - ఇటువంటి చికాకు పరిస్థితులలో నేను చిక్కుకోలేదు. ఆ సమయంలో నా సహజ వివేకం కూడా నన్ను విడిచిపెట్టి పారిపోయిందను కుంటాను. ఆఖరికి, తప్పనిసరిగాం కంపెనీకి మిగి