పుట:Naajeevitayatrat021599mbp.pdf/544

ఈ పుట ఆమోదించబడ్డది

లంలో రాలేకపోయామనీ, ఒక అతి ముఖ్యమయిన విషయం గురించి మాటలాడడానికి పట్నంనుంచి వచ్చామనీ, అందువల్ల ఆదివారం అయినా అ మర్నాడు ఒక్క అయిదు నిమిషాలపాటు సూర్యనారాయణరావు నాతో సంప్రతించడానికి సావకాశం ఇప్పించవలసిందనీ మేజర్ ఖాన్‌ను కోరారు.

ముందర అవకాశం ఇవ్వ నిరాకరించినా, తరవాత, అల్లాగే అయిదు నిమిషాలసేపు మాట్లాడవచ్చునని, సూర్యనారాయణరావుకు అనుమతి ఇచ్చాడు. వా రుభయులూ, వెల్లూరు వచ్చేముందర, తమకు నాతో సంప్రతించడానికి అనుమతి కావాలన్న దరఖాస్తు కూడా పెట్టుకోలేదు. నేను ఆ వారంలో ఎవరినయినా కలుసుకుంటానని గాని, అందులో ఆదివారం ఉదయం ఆరుగంటలకే అది తటస్థపడుతుందని కాని ఊహించలేదు.

ఆ రోజు ఉదయం ఆరుగంటలకు మేజర్ ఖాన్ నా గదికి వచ్చి, నాతో చాలా అర్జంటు విషయాలమీద మాటలాడడానికి పట్నంనుంచి ఎవరో మిత్రులు వచ్చారనీ, వారితో నేను అయిదు నిమిషాలసేపు సంప్రతించడానికి తాను అనుమతి నిచ్చాననీ చెప్పి, నన్ను తన వెంట రమ్మాన్నాడు. నన్ను చూడడానికి వచ్చిన వారి పేరు మేజర్ ఖాన్ చెప్పలేక పోయాడు.

ఎవ్వరితో మాటలాడడానికి నాకు అనుమతి ఇవ్వబడిందో, వారి పేరయినా ఎరగనే అని, ఆ అనుమతిని నిరాకరించాలని అనుకున్నా సాధ్యం కాలేదు. నేను ఖాన్ గారి వెంట వెళ్ళాను. ఆ ఆసామీ లోపలకు తీసుకు రాబడ్డాడు. వచ్చింది ఇంటి యజమాని సూర్యనారాయణరావు గారు. ఆయన నాతో ఆ ఇనుప కటకటాల లోపల అయిదు నిమిషాల సేపు మాటలాడడానికి అనుమతింపబడి ఉన్నాడు.

ముందు ట్రాన్స్‌ఫర్ దస్తావేజు

మేజర్ ఖాన్ కొంచెం అవతలగా బయటనే నుంచుని, నిమిషాలు లెక్కపెడుతూ, నిమిషం అయిన వెంటనే గట్టిగా అరవడం మొదలు