పుట:Naajeevitayatrat021599mbp.pdf/532

ఈ పుట ఆమోదించబడ్డది

కరించి తీరాలనీ, రక్షణల విషయంలో తీసుకోతగ్గ మార్గాలను వారే నిర్ణయించవచ్చుననీ గాంధీగారు సూచించారు. సరిఅయిన రాజ్యాంగ విధానం రూపొందించి తీరాలనీ చెప్పారు. కాగా, ఈ మధ్య కాలంలో కల్లు దుకాణాల దగ్గర, విదేశీ బట్టల దుకాణాల దగ్గరా పికెటింగ్ కొనసాగించే హక్కు కాంగ్రెసువారికి ఉండా లన్నారు.

ఇద్దరు మధ్యవర్తులు గాంధీగారి సూచనలనుకూడా గ్రహించినవారై, నాయకుల అభిప్రాయాలనూ పరిశీలన చేయవలసి ఉంటుందంటూ, వాటిని వైస్రాయ్‌గారి ముందు ఉంచారు. ప్రభుత్వంవారి మనస్సులో ఏముందో ముందుగా గ్రహించకుండానే రాయబారాలకి ఆ ఇరువురూ పూనుకోవడం శుద్ధ తప్పు. అంతేకాదు - మోతీలాల్‌నెహ్రూ గారిని అరెస్టు చేసేముందు, ఆయన స్లోకోంబ్‌కు తెలియజేసిన అభిప్రాయాలను నిర్భంధంలో ఉన్న గాంధీగారి అభిప్రాయాలతో గుదిగుచ్చడం ఇంకొక తప్పు.

మున్ముందుగా అప్పటి కప్పుడు భారతదేశానికి పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఇస్తామని వాగ్దత్తం చేసితీరాలని గాంధీజీ తన అభిప్రయాన్ని స్పష్టంగానూ, స్ఫుటంగానూ చేప్పేశాడు. పైగా ఆ వాగ్దత్తం రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్‌వారి ఎదుట బహిరంగ పరచాలనీ, అధమం పార్లమెంటు వారి ఎదుటనయినా దాని ప్రసక్తి ఎత్తాలనీ ఆయన సూచించాడు. వారు చేసే ప్రత్నామ్నాయ సూచనలకు అది కొంత వరకూ అనుగుణంగా ఉండవచ్చునని అన్నా డాయన.

వైస్రాయ్ వెనకడుగు

కాని పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని భారతదేశానికి ఇవ్వడానికి ఒప్పుకున్నా డనుకున్న ఆ వైస్రాయ్‌గారు, అప్పుడే తన పుట్టె మునిగినటు అడుగులు వెనక్కి వెయ్యడం ఆరంభించాడు. అల్లా వెనకడుగు వేస్తూనే నాయకులను సందర్శించడానికి సప్రూ - జయకర్ల గారికి అనుమతి ప్రసాదించాడు. వైస్రాయ్ వెనకడుగు వేయడానికి కారణం మోతీలాల్ నెహ్రూగారు. ఆయన అరెస్టుకు పూర్వం, స్లోకోంబ్‌ను