పుట:Naajeevitayatrat021599mbp.pdf/514

ఈ పుట ఆమోదించబడ్డది

ఆహ్వానించి, నాకు ఏమి కావలసినా, ఏ సదుపాయం కావలసినా, అన్ని వేళలలోనూ, అన్నీ సమకూరుస్తూ ఉండేవారు.

చిన్న చిన్న దొంగతనాలు

జెయిలు ఆవరణ లోపల మంచి కూరగాయ తోటలుండేవి. వాటిని జాగ్రత్తగా పెంచుతూ ఉండేవారు. కొంతమంది యువకఖైదీలు ఉదయం 6 గంటలకు జెయిలు తెరవబడడంతోనే ఆ తోటవైపునకు పరుగెత్తి, ముళ్ళతీగెలతో ఏర్పరచబడిన కంచెను గెంతి అక్కడ పెరుగూతూన్న లేత బెండకాయలు మొదలైన వాటిని తెగ తినేవారు. వార్డర్లు వాళ్ళను పట్టుకుని జెయిలరు దగ్గరకో, సూపరింటెండెంట్ దగ్గరికో తీసుకు వెళ్ళేవారు. అందువల్ల ఆ సూపరింటెండెంట్ నన్నూ, వెంకటప్పయ్యగారినీ, ఇంకొక రిద్దరినీ పిలిపించి, ఆ కుర్రవాళ్ళు అల్లరి చేయకుండా చూడవలసిన పూచీ మాదనీ, వాళ్ళని అదుపులో పెట్టి సరిగా ప్రవర్తించేటట్లు చూడమనీ మాకు చెప్పారు.

స్వాతంత్ర్యదినంనాడు, తెలతెలవారుతూండగా, మేము మా సెల్స్‌లోంచి బయటకు వచ్చేసరికి ఆఫీసర్లలో ఉత్పన్నమైన పెద్ద కలవరం వినబడింది. కాంగ్రెసు జెండాలు టవర్‌మీదా, ఖైదీలుంటూన్న బ్లాకు బ్లాకుమీదా ఎగురవేయబడుతున్నాయన్న గందరగోళం ఎక్కువయింది. ఆఫీసర్లు చిక్కులలో పడడం న్యాయమే కదా! ఈ చర్యకు నాయకు లెవరో తేల్చుకోవా లన్న విషయంలో, ఎంతో తర్జన భర్జన జరిగింది. పరిశోధన పెద్ద ఎత్తునే జరిగింది. కాని, ఈ కార్యానికి కర్త ఎవరో తేలలేదు.

నన్ను కన్ననూరు బదిలీచేసిన కొద్ది రోజులలోనే బొంబాయి నివాసి బాట్టివాలా అన్న అతడు బదిలీ అయి, అక్కడకు సూపరింటెండెంట్‌గా వచ్చాడు. ఆయన వచ్చిన కొద్దిరోజులలోనే యువకులు చాలా మంది అతన్ని చుట్టుముట్టి, తమకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కావాలని కోరారు. జెయిలు అధికారులు ఆ కోర్కెలు మన్నించలేదు. యువకులు నిరాహార దీక్షకు ఉపక్రమించారు. ఈ సంగతి నాకు నాలుగైదు రోజుల వరకూ తెలియదు. ఆ యువకులంతా జెయిల్లో మాకు