పుట:Naajeevitayatrat021599mbp.pdf/507

ఈ పుట ఆమోదించబడ్డది

మమ్మల్ని ఎక్కువ ఇదిగా చూస్తారనీ భావించాం. అనేక విషయాలలో వెల్లూరు జెయిలు బాగానే ఉందిగాని, నీటి ఎద్దడి విషయంలో తిరుచిరాపల్లి జెయిలుకు ఏమీ తీసిపోదు. 'ఎ', 'బి' తరగతి ఖైదీలకు విడిగా ఒక కాంపౌండ్‌లో ఉన్న ఒక హాలు ప్రత్యేకించబడింది. మేజర్ ఖాన్ అప్పు డక్కడ సూపరెంటెండెంటుగా ఉండేవాడు. రూల్స్‌కు భిన్నంగాని పరిస్థితు లన్నింటిలోనూ ఆయన సత్యాగ్రహ ఖైదీల గోడు వినేవాడు.

మాకు నిర్దేశించబడిన బ్లాకులలో నీటికొరత బాగా ఏర్పడింది. అప్పటికి నాకు తొట్టి స్నానానికి వీలుగా ఒక తొట్టి యివ్వబడింది. కాని స్నానాలగది ఆవరణలో నీటి సప్లయికి ఏర్పాటు లేదు. అది మా కందరికీ కలిపి ఇవ్వబడిన బ్లాక్. సాధారణంగా, 'ఎ' క్లాసు ఖైదీలు మా జెయిలుకు ఎక్కువగా తరలించబడిన పరిస్థితులలో, కాంపౌండ్ వెలుపల ఉన్న చిన్న చిన్న 'ఔట్ హౌస్‌' లో వారికి జాగా చూపించేవారు. ఆ బహిర్గృహాలలో మలయాళ దేశీయులూ, నా మిత్రులూ అయిన కీ॥ శే॥ రామున్నీ మేనోన్ (ఆయన మంత్రిగా కూడా కొంతకాలం వ్యవహరించాడు), కె. మాధవ మేనోన్, ఆర్. రాఘవ మేనోన్ ప్రముఖు లుండేవారు.

తలవంపు పద్ధతి

పైల్ పద్దతన్నది 'జెయిల్ రూల్స్‌'లో అనాదినుంచీ ఉన్న ఆచారమే. ఆ పద్ధతి సాధారణ ఖైదీలకోసం పుట్టింది. జెయిలు పరిపాలనా విధానంలో "రాజకీయ ఖైదీలకు" అంటూ ప్రత్యేకించబడిన నిబంధనావళులు ఏవీ లేవు. ఆ దురదృష్ట దినాలలో, లోకమాన్య బాలగంగాధర తిలక్, లాలా లజపతిరాయ్ వంటి మహానీయులను అరెస్టుజేసి శిక్షించడం జరిగినా, వారిని ఇతరులతో కలవకుండా ప్రత్యేకించి వేరువేరు జాగాలలో ఉంచేవారు.

ఈ సహకార నిరాకరణ ఉద్యమం అంటూ ఆరంభం అయ్యాక జీవితాన్నే దేశసేవ కర్పించిన నూతన వర్గపు రాజకీయ ఖైదీలు ఆవిర్భవించారు. అటువంటి రాజకీయ ఖైదీలు 1921 నుంచీ జెయిళ్లలో