పుట:Naajeevitayatrat021599mbp.pdf/497

ఈ పుట ఆమోదించబడ్డది

జిల్లాలలోని నాయకులు అనుసరించారు. దక్షిణాన రాజగోపాలాచారిగారూ, ఉత్తరాన పశ్చిమగోదావరిజిల్లాలో దండు నారయణరాజూ, గోవిందరాజులు మొదలైనవారు గాంధీగారి మార్గాన్నే అవలంబించారు.

ఆంధ్రదేశంలో ఉప్పు సత్యాగ్రహం

ఆంధ్రదేశానికి సంబంధించినంతవరకూ, తూర్పు - పశ్చిమగోదావరిజిల్లాలలోనూ, కృష్ణా - గుంటూరు - నెల్లూరు జిల్లాలలోనూ, విశాఖ, గంజాం జిల్లాలలోనూ అక్కడి నాయకులు, గాంధీగారి మారాన్ని అనుసరిస్తూ, ఉప్పు సత్యాగ్రహాన్ని ఎంతో చాకచక్యంగా నడిపించి, ఆయాప్రాంతాలను చరిత్ర ప్రసిద్ధం చేశారు. కేవలం కాలినడకను వెళ్ళడమే కాదు; ఎన్నో క్యాంపులు నడపి, వాలంటీర్లను తయారు చేయడానికి స్థావరాలు ఏర్పరిచారు.

దేవరాంపాడు శిబిర సమరం

గుంటూరు జిల్లాలో 'దేవరాంపాడు' గ్రామంలోనూ, విశాఖ జిల్లాలో వడలి గ్రామంలోనూ నడిపిన క్యాంపులను గురించి కాస్త వివరిస్తాను. దేవరాంపాడులో నాకున్న చిన్న బంగాళానీ, దానిని అంటిఉన్న పొలాన్నీ అక్కడి నాయకులు తీసుకుని, దానిని ఒక శాశ్వతమయిన శిబిరంగా మార్చి, అక్కడికి రెండుమైళ్ళ దూరంలో ఉన్న 'కనపర్తి' గ్రామంలో ఉన్న ఉప్పు కొఠార్లమీదికి దాడి ప్రారంభించారు.

దేవరాంపాడు గ్రామ శిబిరాన్ని ఆధారం చేసుకుని, 'గంగాకలం' అన్న చిన్న నదిని దాటి (నది ఒడ్డునే ఆ శిబిరం ఉంది) వాలంటీర్లు రంగంలోకి దిగేవారు. ఇది చాలా అనువయిన స్థానంగా ఉండేది. నది సముద్రంలో కలిసే సంగమప్రాంతం అక్కడికి మైలులోపుగానే ఉంది. వాలంటీర్లకు ఆ నది దక్షిణపు గట్టున ఉండడానికి వీలుగా ఉండడాన్ని వారు ఒక బ్రహ్మాండమయిన పథకం వేసుకున్నారు.

తరవాత కార్యరంగంలోకి దిగారు. జట్లు జట్లుగా ఉప్పుకొఠార్ల