పుట:Naajeevitayatrat021599mbp.pdf/483

ఈ పుట ఆమోదించబడ్డది

వీరందరితో కలసి అ ప్రాంతానికి వెళ్ళడ మన్నది ఒక అలజడిని లేవతీసింది. మేము అ నీటిలో దిగి సుమారు రెండు బస్తాల ఉప్పును సేకరించాము. ఆ రెండు బస్తాల ఉప్పూ కారులో వేసుకుని వెనక్కి బందరు వెళ్ళాము. పోలీసువారు అ కారునీ, ఆ రెండు బస్తాల ఉప్పునే గాక మాలో కొందరినయినా నిర్బంధిస్తారని తలచాను. కాని నా ప్రయాణమూ, ఉప్పును ప్రోగుజేసుకు రావడమూ అన్నవి ముందుగా అనుకోని పను లవడాన్ని వారికి ఆశ్చర్యం కలుగజేసినా, అవసర చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకపోయింది.

గుంటూరులో ఉప్పు తయారీ

తిరిగి వచ్చి, తెచ్చిన ఉప్పు పెద్ద పెద్ద మొత్తాలుగానే ఊళ్లో పంచి పెట్టించి, నేను బెజవాడ మీదుగా గుంటూరు వెళ్ళడానికి రైలెక్కాను. నేను రైలులో ఉండగానే ఏ స్టేషన్‌లో నయినా అరెస్టు కావచ్చునని వారంతా భావించారు. అటువంటిదేమీ జరక్కుండానే నేను గుంటూరు వెళ్ళి, అక్కడ కాంగ్రెసు వర్కర్లు సముద్రపు నీరు మరగబెట్టి ఉప్పు చెయ్యడం గమనించాను. అప్పటికీ గుంటూరు పోలీసులుకూడా ఏవిధమయిన చర్యా తీసుకోలేదు. అక్కడి మిత్రులతో నేను బందరులో చేసిన చేతలను వివరించి చెప్పి, ఆ జిల్లాలవారు ఎల్లా పోరాటానికి ఉద్రిక్తులయి తయ్యారుగా ఉన్నారో వివరించాను. పోలీసులు ఈ వేళ యేమీ చేయకపోయినా, వారు అలా చూస్తూ కూర్చోడానికి తావు లేదనీ, ఈవేళగాకుంటె రేపయినా వారు అరెస్టు చెయ్యక తప్పదని వివరించాను.

దేవరాంపాడు గ్రామంలో సముద్రతీరాల ఉన్న స్వంతభూములలో ఉప్పు పండించమనీ, అక్కడికి 2 మైళ్ళ దూరంలో ఉన్న కనపర్తి గ్రామంలో ఉన్న ప్రభుత్వపు ఉప్పు గిడ్డంగిపై దాడి సలపమనీ సలహా యిచ్చీ, దేవరాంపాడులో నా కున్న అ కాస్త భూమిని వాలంటీరు క్యాంపు నడుపుకోవడానికి ఇచ్చాను. మా ఉద్యమానికి బలం చేకూరిన కొద్దీ, ఆ గ్రామంలో నెలకొల్పబడిన ఉప్పు సెంటరు చాలా