పుట:Naajeevitayatrat021599mbp.pdf/478

ఈ పుట ఆమోదించబడ్డది

జేశాను. రైతు లందరూ కట్టుగా ఒకే మాటమీద నిలబడి ఉండడం గమనించిన ప్రభుత్వంవారు, 1932 వరకూ అమలు పరచమని అదనపు పన్నులు వాయిదా వేయవలసివచ్చింది.

అ రోజులలోనే గాంధీగారు రౌండు టేబిల్ కాన్ఫరెన్స్‌నుంచి తిరిగి రావడమూ, అ సందర్భాన్ని పురస్కరించుకుని, ఒక అపసవ్యపు సాకుతో, నన్నూ, ఇంకా కొంతమంది మిత్రులనూ ప్రభుత్వంవారు అరెస్టు చేయడం జరిగింది. పెంచిన పన్నుల రద్దు చేయకపోయినా, ప్రభుత్వానికి వాటిని వసూలు చేయగల దమ్ము లేకపోయింది.

ఈ ప్రకారంగా తమ నాయకులయందు భక్తి ప్రపత్తులుగల ఆంధ్ర ప్రజానీకం, ఆ నాయకులపట్ల విశ్వాసంతో ప్రవర్తించి, తమ మీద ప్రభుత్వం విధించిన హెచ్చు పన్నుల బాధనుంచి, తమకు తాముగానే విముక్తులయ్యారు. ఈ సందర్భంలో వారు కాంగ్రెసు అధిష్ఠాన వర్గంవారి సహాయంగాని, దేశంలోని ఇతర ప్రఖ్యాత నాయకుల సహకారంగాని వాంఛించలేదు.

లాహోరు కాంగ్రెస్ తీర్మానానుసారంగా కేంద్ర, రాష్ట్రీయ శాసన సభలలోని కాంగ్రెసు సభ్యులందరూ ఏకగ్రీవంగా వారి వారి సభ్యత్వాలకు రాజీనామాలిచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు. యావత్తు భారత దేశంలోనూ నడచిన ఆ ఉప్పు సత్యా గ్రహపు చరిత్ర ప్రపంచ చరిత్రకే తలమానిక మయింది. ప్రతి రాష్ట్రంలోనూ జరిగిన సంఘటనలన్నీ రాబోవు తరాలవారి ప్రయోజనం కోసం సరిగా రికార్డుచేసి ఉంచవలసిన బాధ్యత చరిత్రకారుల భుజస్కంధాలమీద ఉంది.

9

దక్షిణాదిని ఉప్పు సత్యాగ్రహం

నేను పట్నంచేరేసరికి మదరాసు పరిస్థితి చాలా నిర్జీవంగా కనబడింది. శవం వెళ్ళిన కొంపలా కళా విహీనంగా ఉంది అ మహాపట్నం. ఆ పరిస్థితిలో నాకు రెండే రెండు గొంతుకలు వినబడ్డాయి. ఒక గొంతుక