పుట:Naajeevitayatrat021599mbp.pdf/446

ఈ పుట ఆమోదించబడ్డది

లోనవుతూన్న భారతీయకార్మికుల విషయంలో అసలే యేమీచేయలేక పోయాం. పశ్చిమ దేశవాసుల పద్ధతులమీద ఏర్పడిన కార్మిక సంఘాల ద్వారా ఏమయినా సహాయం చేయగలమేమోనని తలిస్తే, ఆ సంఘాల ఆశయాలలో, మన దేశీయులకూ - వారి పరిస్థితులకూ అవసరమైన మార్గాలలో, వారి అవసరాలను తీర్చే విధానంగా ఏ సేవా చెయ్యడానికి సావకాశం ఉండేదికాదు.

వ్యవసాయ శ్రామికుల స్థితిగతులు

మాటవరసకి చూడండి - మనకి ఉన్న కార్మిక సంఘాలు వ్యవసాయ శ్రామికుల విషయంలో ఏమీ చెయ్యలేవు. మరి మన దేశంలో ఉన్న కష్టజీవులలో నూటికి 90 పాళ్ళు వ్యవసాయ శ్రామికులే కదా? ఈ వ్యవసాయ శ్రామికుడుకి చెప్పుకోతగ్గ సంఘాలు, అవసరాల విషయమై విన్నపాలూ, వేడికోళ్లూ లేని కారణంగా, కాంగ్రెసు పరిపాలనలోనే ఉన్న లేబర్ కమిషనర్‌గాని, కార్మిక మంత్రిగాని ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండిపోయారు.

అయినప్పటికీ, ఇప్పటివరకూ, ఈ శ్రమజీవుల కష్టసుఖాల విషయమై ఏ విధమయిన విచారణా జరుగలేదు. వ్యవసాయ శ్రామికుల కిచ్చే కూలీ ఎంత? అసలు వ్యవసాయపు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి? ఆ ఖర్చులో శ్రామికుల కిచ్చేది ఎంత? ఇల్లాంటి ప్రశ్నలు పుట్టినా, వాటికి సరి అయిన సమాధానాలు చెప్పడానికి అంకెలు ఎవరివద్దా లేవు.

మేము రాజ్యాంగం చేపట్టిన తరుణంలో నేను మద్రాసు రాష్ట్రంలో రెవిన్యూ మంత్రిగా వ్యవహరిస్తూన్న రోజులలో ఈ వ్యవసాయ శ్రామికుల విషయం గమనించడానికి వీలు చిక్కింది. ప్రభుత్వ ప్రాంతాలలోనూ, జమీందారీ ప్రాంతాలలోనూ భూమిపై యజమానికి ఉన్న హక్కు భుక్తాలూ: యజమానులకూ, రైతులకూ, శ్రామికులకూ మధ్య ఉన్న ఒడంబడికలూ వగైరాలన్నీ విచారించవలసిన అవసరమూ కలిగింది. నిజంగా దేశంలో పూర్తి స్వాతంత్ర్యాన్ని నెలకొల్పి, దానిని సరిగా నిలబెట్టుకోవడానికి అన్నిరకాల కష్టజీవుల సహకారమూ