పుట:Naajeevitayatrat021599mbp.pdf/437

ఈ పుట ఆమోదించబడ్డది

వలసివచ్చింది. దాని విషయంలో ఇంకేమయినా విచారణ, వగైరాలు జరిపించి ఉంటే, 'అవును', 'కాదు' లాంటి పదాలతో మా స్థితి ఇంకా బాగా పలచనై పోయేది. "సహకరించవద్దు,, దానిని వ్యతిరేకించండి" అనే పార్టీ ఆజ్ఞకు భిన్నంగా జరిగిన ఈ సంఘటన సహించరానిదే గదా! నిజానికి ఆ విహ్‌ప్‌కీ, అండర్ సెక్రటరీకి మధ్య నడచిన కథ మాత్రం చాలా దారుణమయింది. ఆ మూడు సంవత్సరాల శాసన సభా అనుభవంలో చాలా వింత సంఘటనలే జరిగాయి. కాని దీనిముందు మాత్రం అవన్నీ పగటి దివ్వెలే. మామూలు చిన్న ఉద్యోగి కూడా కొన్ని సందర్భాలలో మా పార్టీ అధికారులమీద తన శక్తినీ, ప్రతిభనూ చూపగలిగాడు. ఆనాటి దొరస్వామయ్యంగారూ, రంగస్వామయ్యంగారు, ఆ కార్యదర్శీ, ఆ విహ్‌పూ, ఆ పార్టీ లీడరూ అంతా గతించిన తర్వాత చాలా కాలానికి నేను ఈ కథను ప్రస్తావించడం అన్యాయమే. కాని ఈ సంఘటన చాలా ముఖ్యమయిందీ, మా పార్టీకి సంబంధించిన ఎన్నో లోటుపాట్లకు నిదర్శన ప్రాయమైందీ అవడంచేత మీ ముందు పెట్టవలసి వచ్చింది.

5

బ్రిటిష్ పథకానికి ప్రతి పథకం

సైమన్ కమిషన్ వారు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పర్యటించిన ఆ 1928లోనే, మార్టిన్‌జోన్స్, పి. ష్రాప్ అనే బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు మన దేశాన్ని చూడ్డానికి వచ్చారు. వారు మమ్మల్ని కేంద్ర శాసన సభలో కలిసినప్పుడు, మేము శాసన సభా సభ్యులుగానూ, శాసన సభలోనూ చేస్తూన్న పనిని గురించి అడిగారు. వారికి మేము ఎల్లా నిరంకుశంగా శాసన సభా వ్యవహారాలు నడిపించబడుతున్నదీ, భారతీయుల దనం ఏ విధంగా నిరంకుశంగా దుర్వినియోగం అవుతూ ఉన్నదీ వివరించి చెప్పాము. వారు మాకు సన్నిహితులయిన మిత్రులుగానే వ్యవహరించారు. మా పరిస్థితికి విచారాన్ని వెలిబుచ్చారు. జబర్దస్తీగా