పుట:Naajeevitayatrat021599mbp.pdf/436

ఈ పుట ఆమోదించబడ్డది

సంగతి సందర్భాలు చర్చించడానికిగాను వ్యవధి లేదు. జరిగిపోయిన కీడునూ, చెడుగునూ ఇంకే విధంగానూ సరిదిద్దుకోవడానికి మార్గం కనబడలేదు. అందుచేత కాంగ్రెసు పార్టీవారు చీఫ్ విహ్‌ప్పు ఆజ్ఞను పాలించకుండా ఉండవలసి వచ్చింది. దానివల్ల కాంగ్రెసు పార్టీవారు అటు అనుకూలంగా గాని, ఇటు ప్రతికూలంగా గాని ఓటు చేయలేని స్థితిలో తటస్థంగా ఉండడం తప్పని సరయింది. ప్రభుత్వంవారి బిల్లు ఆమోదించబడి, చట్టమయి పోయింది.

దర్మిలా మా నాయకుడూ, ఆయన కార్యదర్శీ కూడా ఆ ఆజ్ఞ కాలవ్యవధి లేకుండా అతి త్వరితంగా ఇచ్చామనీ, అల్లా ఇవ్వడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదనీ, ఆ బిల్లును వ్యతిరేకించడం అనవసరం అనే అభిప్రాయంతో అల్లా తుది నిర్ణయంగా ఆ ఆజ్ఞ యిచ్చామనీ అన్నారు. ఆ బిల్లు ఆమోదించబడి, చట్టంగా ప్రకటితమయిన ఆనాటి సాయంత్రం జరిగిన సంఘటన చాలా కలవరపాటునూ, చికాకునీ, ఆశ్చార్యాన్నీ కలుగజేసింది.

నా మిత్రుడూ, చిత్తూరు నివాసీ అయిన కీ॥ శే॥ శ్రీ సి. దొరస్వామయ్యంగారు ఒక డిప్యూటీ సెక్రటరీగారికి ప్రత్యేకించబడిన గదిలోకి వెళ్ళారు. వెళ్ళి, అక్కడ ఆ గదిలో అడ్డంగా ఉంచబడిన తెరవెనుక ఆసీనుడయ్యాడు. దొరస్వామయ్యంగారు లోపలికి వెళ్ళిన కొద్ది సేపటిలో ఆ గదిలోకి మా పార్టీ విహ్‌ప్పు ఒకాయన వెళ్ళాడు. ఆయన అ గదిలో ప్రవేశిస్తూనే, ఆ స్క్రీన్ వెనుకనున్న దొరస్వామయ్యంగారిని గమనించకుండా, అయనతో కబుర్లలో పడ్డాడు. "హల్లో, చూశారా! నేను మా పార్టీవారి నెవ్వరినీ ఆ బిల్లుకు ప్రతికూలంగా వోటు వెయ్యవద్దని ఆజ్ఞాపించాను. ఆ ప్రకారంగానే ఎవ్వరూ ఓటు వెయ్యలేదు" అన్నాడు.

ఇది ఆ బిల్లుకు సంబంధించిన విషయం. మేము ఇంటికి వెళ్లాక దొరస్వామయ్యంగారు ఈ సంగతి నాతో చెప్పారు. ఆ సంఘటన మాలో తత్తరపాటునీ, చికాకునీ, అసహ్యాన్నీ కలిగించింది. మేము సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఏర్పడింది. ఆవిషయాన్ని అల్లా వదలివేయ