పుట:Naajeevitayatrat021599mbp.pdf/426

ఈ పుట ఆమోదించబడ్డది

అంత సుముఖులే. మోతీలాల్‌గారు 1921 లో ఆ శాసన ధిక్కార ఉద్యమపు ఆరంభ దినాలలో స్వయంగా జెయిలుకువెళ్ళి ఆ ఉద్యమానికి ఖ్యాతి సంపాదించాడు. ఆయనలో ఉన్న బలహీనతల్లా, లార్డ్ రీడింగ్ సూచించిన రాజీ ప్రతిపాదనలను పట్టుకుని గాంధీగారితో తగవులాటకు దిగడమూ, కాంగెసును రెండుగా చీల్చి, గాంధీగారు జెయిలులో ఉన్న రోజులలో స్వరాజ్యపార్టీని స్థాపించడము. ఆయన గాంధీ తర్వాత గాంధీ అంతటివాడు. గాంధీ తర్వాత నాయకుడుగా ఆయనే దేశాన్ని నడిపించవలసి ఉంది.

శాసన ధిక్కారం అంటే ఇష్టంలేని శ్రీనివాసయ్యంగారికి మోతీలాల్‌గారు స్థాపించిన స్వరాజ్యపార్టీ నచ్చిన కారణంగానే ఆయన కాంగ్రెసులో జేరాడు. మితవాదిగానే చెలామణీ అవుతూన్న శ్రీనివాసయ్యంగారు, ఆ అసెంబ్లీ పార్టీలో మోతిలాల్‌గారితో సాన్నిహిత్యం సంపాదించి హాయిగా వారితో సాయిలా సాయిలాగా ఉండవలసింది. అటువంటి పరిస్థితులలో వారి మధ్య అభిప్రాయభేదా లుండేవంటే, ఆ తేడా పాడాలకు కారణం భగవంతుని సృష్టిలోనే ఉన్నటువంటి 'తమాషా' అని అనవలసి ఉంటుంది. పుష్పంలా వికసిస్తూన్న ఆయన తెలివి తేటలతో ఆయన, ఆచరణలో గాకపోయినా, ఊహాలో మాత్రం అందర్ని అతిక్రమించగల నేర్పరి. అంటే, కత్తిపోటుకంటే కలం పోటులో మాంచి దిట్ట అవడాన్ని, అందర్నీ తన విజ్ఞానంతో మించి రాణించవలసిన వ్యక్తి.

స్వాతంత్ర్యం కోసం పార్టీ

"స్వాతంత్ర్యం" విషయంలో మోతీలాల్‌గారితో అభిప్రాయ భేదం ఆరంభం అయింది. ఇదివరలోనే చెప్పాను - రణ రంగంలో తప్ప మోతీలాల్ మితవాదులలోకల్లా మితవాది అని. కాని, ఆయన కుమారుడే అయిన జవహర్ మాత్రం, దేశానికి స్వాతంత్ర్యం కోరడంలో, తండ్రిని మించిన కొడుకయ్యాడు. శ్రీనివాసయ్యంగారు జవహర్‌లాల్‌తో చేతులు కలిపి, సాంబమూర్తి సహకారంతో కేంద్ర శాసన