పుట:Naajeevitayatrat021599mbp.pdf/424

ఈ పుట ఆమోదించబడ్డది

లీడర్‌కి చూపడంగాని, తనకు తానుగానే ఒక చిన్న సర్దుబాటు చేయడంగాని జరుగుతుందని ఆశించాం.

అల్లా జరగని కారణంగా పార్టీమీటింగ్‌లో "సభలో లీడర్‌గా తదితర సభ్యుల తప్పొప్పులను కాపాడవలసిన లీడరే చేసిన పొరపాటుకు చింతిస్తున్నాము" అని ఒక తీర్మానం ప్రతిపాదించాను. దాన్తో మాపార్టీ మీటింగ్‌లో అలజడి బయల్దేరింది. ప్రతి సభ్యుని హృదయమూ తహతహ లాడింది. ఒకటి రెండుసార్లు ఈ విషయం కార్య నిర్వాహక వర్గం వారి ముందుకు వచ్చింది. కాని దానిని నిరవధికంగా నెట్టివేశారు. డెప్యూటీ లీడర్ శ్రీనివాసయ్యంగారు మూగనోము పట్టడంచేతా, లీడర్ తాము చేసిన పనిని సరిదిద్దుకోడానికి ఒప్పుకోని కారణాన్నీ, దాని గతి ఇలా పట్టింది. ఈ విషయాన్ని జనరల్ బాడీ ఎదుట పెట్టవలసిందని కార్యదర్శినీ, అధ్యక్షుణ్ణీ కోరినప్పుడు అల్లాగే అంటూనే ఏడాది దాటించారు.

ఈ ఏడాదిలోనూ సభ్యులంతా విడివిడిగానూ, నలుగురూ కలిసి నా వద్దకు వచ్చి, నాయకునిమీద అటువంటి తీర్మానం తగదు, దానిని ఉపసంహరించుకోవలసిందని కోరారు. నేను ఒప్పుకోలేదు. నాకు ఆయనపై వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషమూ, దురభిప్రాయమూ లేవనీ, సభ్యులకు కావలసిన రక్షణ ఉండాలనే కాంక్షే అ ప్రతిపాదన తీసుకు రావడానికి కారణమనీ సూచించాను. అయినాగానీ, మెంబర్లందరూ అవసరమయిననాడు తామంతా నాయకుడ్నే సమర్థిస్తాం అని కూడా అంటూ, నన్ను అ ప్రతిపాదన తగ్గించుకోమని కోరారు. సి. ఎస్. రంగయ్యరు కూడా నన్ను భయపెట్టాడు. "ఇప్పటి వరకూ నాయకు డొక్కడే, చేసిన పొరపాటుతో అపహాస్యాల పాలయ్యాడు. మీరంతా ఆయన్ని సమర్థించే పక్షంలో మిమ్మల్నందర్నీ చూసి ప్రపంచకం అపహాస్యం చేస్తుం"దని విశదీకరించాను.

రాజీ ప్రతిపాదన

సంవత్సరాంతంలో ఒక రాజీ ప్రతిపాదన సూచించబడింది. ఆ కారణంగా మా ఇద్దర్నీ సంఘటన పరిచారు. వారు, మా కలయికకు