పుట:Naajeevitayatrat021599mbp.pdf/421

ఈ పుట ఆమోదించబడ్డది

ఉమ్మడి సభలో వైస్రాయ్‌గారి ఉపన్యాసానికి విఠల్‌భాయ్‌గారు ఆక్షేపణ తెలిపారు. వైస్రాయ్ లార్డ్ ఇర్విన్, ప్రెసిడెంట్‌గారి పేర ఉత్తరం వ్రాస్తూ, అందులో ప్రెసిడెంట్‌ గారి నిర్ణయాన్ని ఖండించడం గాని, దానికి ఆయనపై దోషం ఆరోపించడం గాని తన ఉద్దేశం కాదని స్పష్టం చేశాడు.

ప్రెసిడెంట్‌ మాత్రం, తాను రాజ్యాంగ రీత్యా తనకున్న హక్కులను పురస్కరించుకునే ఆ నిర్ణయాన్ని తీసుకున్నానని తిరిగీ చెప్పాడు. ఈ సందర్భంలో మనం గమనించవలసిన ముఖ్య విషయాన్ని ఒక్క ముక్కలో చెపాలంటే - ఇప్పటికి సుమారు ఇరవై సంవత్సరాలనుంచీ మనం పడూతూన్న తంటాలన్నీ వైస్రాయ్ చేతిలోంచి ఇటువంటి 'అధికారాన్ని' తప్పించాలనే.

మూడు రోజుల ఉపన్యాసం

ఆయన స్పీకరు కాకపోయినా, బిల్లుల మీద నడిచే తర్క వితర్కాలలో విఠల్‌భాయ్ పటేల్ అంతరాయాలు కలిగించేవాడు. ఆయన ఎంత కోపదారయినా, చికాకు తత్వం గలవాడయినా, మాటలాడుతూన్న వారి నెవ్వర్నీ బలవంతంగా ఆపుజేసి కూర్చోబెట్టలేదు. పూచీగల పార్లమెంటులో నయినా ప్రతి సభ్యుడికీ తనకి తోచినంత కాలం, స్పీకరునుంచి అంతరాయం లేకుండా, మాటలాడగల హక్కు ఉంది. ఇతర సందర్భాలలో క్రమ శిక్షణ అమలుపరచి, అవతలి వ్యక్తి ఎవరయినదీ లెక్కచేయకుండా, తన పరిస్థితిని గూడా గమనించకుండా, అవసరమయిన చర్య తీసుకునేవాడు. ఇంత ఇదిగా ఉన్నా, ఆయనవల్ల జరిగిన పొరపాటు ఏదయినా ఉంటే దానిని సూచించిన తక్షణం సరిదిద్దు కునేవాడు.

ఒక రోజున ఒక బిల్లుమీద చర్చ జరుగుతూ ఉండగా, సి. ఎస్. రంగయ్యగారు, మధ్యలో లేచినిలబడి, ఉపన్యసించడం ఆరంభించాడు. రంగయ్యను తన ఉపన్యాసాన్ని అనవసరంగా సాగదీస్తున్నట్లు కనబడడంచేత, విఠల్‌భాయ్‌గారు "మీ ఉపన్యాసం ఇంకా ఎంతసేపువుంటుం"దని అడిగాడు. ఆ రంగయ్యరు తడుము కోకుండా "మూడు