పుట:Naajeevitayatrat021599mbp.pdf/378

ఈ పుట ఆమోదించబడ్డది

ఉచ్చుతో, కాంగ్రెసులో చీలికలు తేవడానికీ, గాంధీగారిని అరెస్టు చెయ్యడానికీ ఆంగ్లేయులకు వీలిచ్చింది.

పైన చెప్పిన ప్రకారం వైస్రాయి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాపిన చేతి నుంచి ఆశామృతపు చుక్కలు రాల్చకుండానే కాంగ్రెసులోని స్వరాజ్యపార్టీ నాయకులను ఆశాపాశ బద్దుల్ని చేయగలిగారు. ఈ ప్రకారంగా ఆ రెండు కాంగ్రెసు విభాగాల మధ్య పొత్తు అన్నది కుదరకుండా 1924 నుంచి 1926 వరకూ అన్న మాటేమిటి, సుమారు 1930 వరకూ కూడా, ఆపు చేయగలిగారు. ఈ తంత్రం అంతా, ఇంగ్లండులో ఉన్న కన్సర్వేటివ్ గవర్నమెంట్ వారు చాకచక్యంతో, 1921 నుంచి 1927 వరకూ, వెనకనుంచీ చక్కగా నడిపించగలిగారు.

అంతేకాదు- 1926 లో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు సాధించిన విజయాలనూ గమనించారు. ఎనిమిది సంవత్సరాలపాటు కాంగ్రెసులోని స్వరాజ్యపార్టీ వారిని ఆశాపాశబుద్ధుల్ని చేసి విడిగా ఆడించినా ఉభయపక్షాలవారూ సన్నిహితంగా వచ్చి జాయింటుగా ఆంగ్ల పరిపాలనా విధానంమీద విరుచుకుపడబోతున్నారన్న సంగతీ గ్రహించారు. రాష్ట్ర కేంద్ర శాసన సభలలో కాంగ్రెసువారు చేస్తూన్న గడబిడలూ, చూపిస్తూన్న రాజకీయ తంత్రజ్ఞతా, అవలంబిస్తూన్న విధానమూ గమనించి, మనం సందిగ్ధ స్థితిలో వస్తున్నాం, ఒక పెద్ద గండాన్ని ఎదుర్కోక తప్పదు అని గుర్తించారు. ఒక వేళ ఏ కారణంచేతనైనా 1929 తర్వాత ఇంగ్లండులో జరగబోయే ఎన్నికలలో లేబర్‌పార్టీవారే అధికారాన్ని చేపట్టగలిగి, భారత దేశానికి ఏదయినా ఇచ్చిపోతారేమో నన్న బాధ పట్టుకుంది వారికి. తద్బాధా నివారణార్థం, ఇల్లాగయినా, ఒక అడ్డుపుల్ల వెయ్యలేక పోతామా అనే ధీమాతో వారు సైమన్ కమిషన్ని ఏర్పరచి మన నెత్తిని రుద్దడం సంభవించింది. ఇటువంటి కమిషన్ని వేసి, వారి అభిప్రాయాన్ని ఆంగ్లప్రభుత్వం మన్నించక తప్పనిసరి అయ్యే ఏర్పాట్లు చేసి, తద్వారా, హిందూదేశానికి ఎవరైనా