పుట:Naajeevitayatrat021599mbp.pdf/349

ఈ పుట ఆమోదించబడ్డది

ర్థ్యాలను ద్రువపరచాయి. అదే ప్రకారం రాష్ట్ర శాసన సభలలో కూడా మనవారు తమ విజ్ఞానాన్ని ప్రదర్శించారు.

ఈ కౌన్సిల్ ప్రోగ్రాం రోజులలో (1927-30) నిర్మాణ కార్యక్రమం దెబ్బతింది. కాంగ్రెసులో వెనుకటివలెనే కేంద్రంలోనూ, రాష్ట్రాలలోను చీలికలు ఏర్పడ్డాయి. మనం 1927 నాటి ముచ్చటలు తెలుసుకునే లోపల, గాంధీగారి వద్దకు తిరిగీ వచ్చే సందర్భంలో జరిగిన కొన్ని సంఘటనలను గురించి తెలుసుకుందాం.

ఢిల్లీ సందర్శనం

గౌహతీనుంచి తిరిగీ వచ్చేటప్పుడు, స్వామీ శ్రద్ధానంద హత్య విషయంలో సమాచార సంగ్రహణ కోసమని, అచ్చటి సంఘటనలను గురించి స్వయంగా విచారిద్దామనే వాంఛ గలిగి ఢిల్లీ చేరుకున్నాను. నేను స్వామీజీ గృహానికి వెళ్ళాను. ఆయన కుమారుడు నాతో వచ్చి, హత్యకు సంబంధించిన సంగతులు చెపుతూ, ఆయా తావులన్నీ చూపించాడు. నిజానికి వారి గృహం ఒక పవిత్రమైన యాత్రాస్థలం. అలా దానిని రూపొందించడం న్యాయమే. లాలా లజపతిరాయిగారూ, స్వామీజీ కలిసే ఆర్యసమాజ కార్యక్రమాలు నిర్వహించేవారు. లజపతిరాయిగారు గౌహతీ కాంగ్రెసులో పాల్గొనడానికి వస్తూ, దారిలో స్వామీజీ హత్యా విషయం వినడంతోనే విషాద భరిత హృదయంతో, ఆగని కన్నీటి కాల్వతో వెనక్కి మళ్ళారు. స్వామీజీని దొంగపోటు పొడిచి చంపారు.

నాభా సమాచారం

బ్రిటిష్ గవర్నమెంట్ వారితో నాభా మహారాజుగారికి వచ్చిన భేటీలో ఆయన, మోతిలాలు నెహ్రూగారిని తమ న్యాయవాదిగా నిర్ణయించుకుని, వారికి వకాలతు ఇచ్చారు. అప్పట్లో కేంద్ర శాసన సభా సభ్యుడుగా ఉంటూ ఉన్న సి. ఎస్. రంగయ్యరు మహారాజావారి ఆప్త మిత్రుడు, సలహాదారుడూను. మహారాజావారికి మోతిలాల్‌గారి కిచ్చిన