పుట:Naajeevitayatrat021599mbp.pdf/337

ఈ పుట ఆమోదించబడ్డది

వారు కాంక్షించారు గాని, రోజులమీద లభ్యమయ్యే అశాశ్వత లాభాల మీదికి వారి దృష్టి మళ్ళలేదు

నేను, ఆంధ్ర రాష్ట్రీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షడనైన కారణంగా, నా నియోజకవర్గంలోనేగాక, ఆంధ్ర దేశం మొత్తంమీద ఉన్న నియోజకవర్గాలన్నింటిలోనూ, తిరిగి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగించవలసిన విధి యేర్పడింది. చేయవలసిన పని బ్రహ్మాండమంత ఉంది.

ప్రజల ఉత్సాహం

ఆంధ్ర రాష్ట్రీయ కాంగ్రెసు సంఘంవారు ఆయా నియోజకవర్గాలకు ఎన్నిక చేసిన అభ్యర్థులందరూ సామాన్య కుటుంబాలవారే, వారికి సొంతడబ్బు ఖర్చుచేసుకోగల స్తోమతు లేదు. మేము ఎన్నికచేసిన అభ్యర్థులలో చాలామంది ముందుగానే ఒక షరతుపెట్టి మరీ నిలుచున్నారు. ఎన్నికలు సాంతం అయ్యేలోగా ఏ సందర్భంలోనూ, ఎప్పుడూ వారిని కించిత్తు కూడా స్వంత ధనాన్ని వినియోగించుకోమని కోరకూడదన్నదే వారి షరతు. కాంగ్రెసు వారికీ ఖర్చుపెట్టడానికి కావలసిన ఆర్థిక స్తోమతు లేదు.

నేనా-"స్వరాజ్య" పత్రిక ప్రచురణాది బాధ్యతలలో చిక్కుకునే ఉన్నాను గదా! ప్రజలే తగు సహాయం చేసి, ప్రోత్సాహం ఇచ్చి కాంగ్రెసువారి విజయానికి తోడ్పడాలని నేనూ, ఇతర నాయకులూ, కాంగ్రెసు సేవకులూ అన్ని ప్రాంతాలలోనూ మేము ఇచ్చే ఉపన్యాసాలలో విన్నపాలమీద విన్నపాలు చేసుకుంటూ వచ్చాం. మేమంతా ఎంతో ఉత్సాహంగా, వాయువేగ మనోవేగాలతో అన్ని ప్రాంతాలూ చుట్టబెట్టాం. రోజూ సాధారణంగా ఇరవై ప్రాంతాలలోనైనా ఉపన్యాసా లిచ్చేవారం. ప్రజలు ఈ ఉద్యమాన్ని వారి "స్వంతం"గానే భావించి, కాంగ్రెసు విజయమే తమ విజయం అని తలచి, కావలసిన ఆర్థికాది సహాయాలు చేస్తారన్న దృడవిశ్వాసం నాకు ఉంది. ఎన్నికలలో కలిగే జయాపజయాల పైన దేశపు భావి అంతా ఆధారపడి