పుట:Naajeevitayatrat021599mbp.pdf/333

ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వాసాన్ని అనుసరించి 21-9-1925 న పాట్నాలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగులో స్వరాజ్య పార్టీవారి శాసన సభా ప్రవేశ కార్యక్రమం అంగీకరించబడింది. [1] కాని దురదృష్టవశాత్తూ వారు తీసుకున్న నిర్ణయం అఖిల భారత కాంగ్రెసు కమిటీవారి పూర్తి అనుమతిలేనిదే అమలుపరచడానికి అవకాశం లేకుండా పోయింది.[2]

నిజానికి అఖిల భారత కాంగ్రెసు కమిటీవారు మెత్తబడి ఉంటే మంత్రిపదవులు చేపట్టడానికి అనుమతి చిక్కి ఉండేది. ఈ మంత్రులు శాసన సభా నియమావళిని మన్నించాలా, దిక్కరించాలా అన్నది తేలనే లేదు.

1926 లో గాంధీగారు కాంగ్రెసునుండి తాత్కాలికంగా విరమించిన సందర్భంలో ఈ స్వరాజ్య పార్టీవారు తమ యిష్టం వచ్చినట్లు కాంగ్రెసును మలచగలిగేవారే. కాని శ్రీనివాసయ్యంగారూ, మద్రాసు శాసన సభా సభ్యులయిన స్వరాజ్యపార్టీ వారు సబర్మతిలో కుదిరిన సమాధానమునకు ఎప్పుడూ విముఖులే కదా! మోతీలాల్ నెహ్రూగారు వారిలో వారికి ఉన్న కలహాలను విస్మరించి కొంతకాలమయినా శాంతంగా విశ్రాంతీ తీసుకోవడం కోసమని ఇంగ్లాండు వెళ్ళిన సందర్భంలో శ్రీనివాసయ్యంగారు వారి అడుగు జాడలలోనే నడవాలని నిశ్చయించు కున్నారన్న విషయం గమనార్హం.

అట్టి పరిస్థితులలోనే 1926 లో గౌహతీ కాంగ్రెస్ అధ్యక్షపీఠాన్ని శ్రీనివాసయ్యంగారు అలంకరించారు.

కాంగ్రెసు పార్టీ అయిన స్వరాజ్య పార్టీ

స్వరాజ్య పార్టీ నాయకుల తమ ఆశయం విఫలం అవడానికి కారణం కాంగ్రెసేననీ, కాంగ్రెసే కనుక తమతో ఏకీభవించి తమ ఆశయమే తనదిగా, తన ఆశయమే తమదిగా ఎంచి అవసరమైన సహకారం ఇచ్చి ఉంటే తాము తమ ఆశయ సిద్దిని సాధించేవారమని

  1. ఈ తీర్మానం కాన్పూరు కాంగ్రెసు ఆమోదించింది.
  2. సబర్మతిలో కుదిరిన సమాధానం ప్రకారం.