పుట:Naajeevitayatrat021599mbp.pdf/322

ఈ పుట ఆమోదించబడ్డది

మహమ్మదీయ మైత్రి ప్రాతిపదికగా ప్రారంభింపబడిన సహకార నిరాకరణ ఉద్యమాన్ని తుదముట్టించాలని ఎదిరి పార్టీవారు యత్నాలు ముమ్మరంగా సాగిస్తూఉంటే, ఈ నోఛేంజ్-ప్రోఛేంజ్ కక్షలవారి కలహాలు అలనాటి 'నీరో' ఉదంతాన్ని స్ఫురణకు తెచ్చేవిగా ఉన్నాయి. రోమునగరం తగులబడిపోతూంటే, చీకూ చింతా లేకుండా నీరో ఫిడేలు వాయించుకుంటూ కూచున్నాడట!

పండ్రెండు మాసాల అనంతరం మళ్ళీ షహజాన్‌పూర్‌లో హిందూ-మహమ్మదీయ కలహాలు సంభవించాయని చెప్పిఉన్నాను. ఈ ఉదంతం వివరించేముందు, 'సింధు' ప్రాంతంలో మా పర్యటన విశేషాలు ఎరుక పరచడం అవసరం అనుకుంటాను. అవి ఆ సంఘటనలను సరిగా గ్రాహ్యం చేసుకోవడానికి తోడ్పడతాయని నా తలంపు.

సింధు పర్యటన ముచ్చటలు

నేనూ, శ్రీ విఠల్‌భాయ్ పటేల్‌గారూ, డా.చేత్రాం మున్నగు ప్రముఖులతో కలసి యేఒక్క ముఖ్యప్రాంతాన్ని వదలకుండా యావత్తు సింధు రాష్ట్రాన్నీ చుట్టివచ్చాం. లోలోపల చిల్లర తగాయిదాలుంటూ ఉన్నా, ఖాదీ మాత్రం సింధు పంజాబు ప్రాంతాలలో బాగా నాటుకుంది. దక్షిణ పంజాబు ప్రాంతాలలోనూ, సింధు రాష్ట్రంలోనూ ఉన్న ప్రతి 'ఖాదీ' భాండారాన్ని పరిశీలించాం. ఖాదీ ఉద్యమం 1921-22 సంవత్సరాలలో దేశం మొత్తం మీద చాలా ఉన్నత స్థాయినే అందుకుంది. పంజాబు ఖద్దరు సున్నితానికీ, మన్నికకూ మాత్రమేగాక పలు రంగులలో చూడ ముచ్చటగా తయారుచేయబడుతోంది. యావత్తు సింధు రాష్ట్రంలోనూ ఖాదీ మంచి ఉన్నత స్థాయిలోనే ఉంది.

మేము పర్యటించిన కరాచీ, నక్కరు, హైదరాబాదు (సింధు) మున్నగు ముఖ్య నగరాలలో హైందవ నారీమణుల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో మున్ముందుగా బైటపడింది. రాష్ట్రం మొత్తం మీద మహమ్మదీయులే జాస్తి హిందువులు అత్యల్ప సంఖ్యాకులుగా దుర్భర జీవితం సాగిస్తున్నారు. హిందూ యువతులను అపహరించడ