పుట:Naajeevitayatrat021599mbp.pdf/311

ఈ పుట ఆమోదించబడ్డది

సబర్మతిలో కుదిరిన రాజీ

ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా ద్వంద్వ ప్రభుత్వ పద్దతిని రాజ్యాంగ విధానాన్ని నడపడానికి ముగ్గురు మంత్రులు ఏర్పడడం అంటూ జరిగాక, ఈ పెద్ద నాయకు లంతా తమలో ఏర్పడిన అభిప్రాయభేదాలనీ, చీలికలనీ సరిదిద్దుకుని తిరిగి ఒకే తాటిమీదకు రావడానికని, గాంధీగారి సబర్మతీ ఆశ్రమంలో సమావేశం అయ్యారు.

స్వరాజ్యపార్టీ మొత్తంమీద మూడు విభాగాలయింది: కొందరు అసలు అనుకున్న ప్రకారం ప్రభుత్వం సాగకుండా అడ్డంకులు తేవాలనేవారు, అవసరం అని తోచినప్పుడల్లా దేశానికి క్షేమకరమయిన ప్రతిపాదనల విషయంలో సహకరించాలనే "ప్రతిస్పంద సహకార" పద్దతివారూ, పూర్తిగా ప్రభుత్వానికి అన్నిరంగాలలోనూ సహకారాన్ని ఇవ్వాలనేవారు.

అందులో అవసరాన్నిబట్టి సహకరిద్దాం, పూర్తిగా సహకరిద్దాం అనే వర్గాలవారు తమ ప్రణాళికనుండి సహకార నిరాకరణం, సత్యాగ్రహం, శాసన దిక్కారం అనే పదాలను ఎత్తివేద్దాం అనే నిశ్చయించుకున్నారు.

దరిమిలా 21-4-1926 తేదీన సబర్మతీలోనే జరిగిన సభలో పై రెండు వర్గాల వారూ ఒక విధంగా ఒప్పందానికి వచ్చి, మంత్రులకు ప్రజాభిప్రాయాన్ని మన్నించగల శక్తి కలిగిననాడు ద్వంద ప్రభుత్వ విధానంగా సహకరించి పరిపాలన సాగిద్దాం అనే నిశ్చయానికి వచ్చారు. కాని అఖిల భారత కాంగ్రెసు కమిటీవారు ఈ విధానానికి ఒప్పుకుంటేనేగాని నిర్ణయం అమలు పరచరాదని భావించారు. బ్రిటిషు గవర్నమెంటువారు మంత్రులు ప్రజలకే జవాబుదారీ అనే సూత్రాన్ని అంగీకరించి నట్లయితే, వారు 1924 పిబ్రవరిలో తాము వెలిబుచ్చిన కోరిక[1]ఒప్పుకున్నట్లుగా, భావిస్తామన్నారు. వారిలో రాజ్యాంగాన్ని

  1. భారత దేశంలో సంపూర్ణ బాధ్యతాయుత ప్రభుత్వ ప్రణాళికను సిఫార్సు చేసే నిమిత్తం రౌండు టేబిలు సభను సమావేశ పరచాలని కోరారు.