పుట:Naajeevitayatrat021599mbp.pdf/306

ఈ పుట ఆమోదించబడ్డది

ఉద్యోగాలను వేటినయినా ప్రభుత్వంవారు ఇస్తామని సూచించి నప్పుడు, వాటిని స్వీకరించడానికి ఏ కాంగ్రెసువాదీ ముందుకు రాకూడదనే ప్రత్యేక తీర్మానమున్నూ ఆమోదింపబడింది. పైగా, ఆ కాంగ్రెసు జరుగుతూన్న రోజులలోనే హిందూస్థాన్ సేవాదళ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. సేవా దళాన్ని గురించి వివరంగా తర్వాత తర్వాత విస్తరిస్తాను.

స్వరాజ్యపార్టీ లీడరుగా రాజకీయ రంగంలో పేరుగన్న మోతిలాల్ నెహ్రూగారి దుర్బలత్వం, ఆయన స్కీన్ (SKEIN) కమిటీ [1]మెంబరుగా ఉండడానికి అంగీకరించడంతో బయల్పడింది. వారి పార్టీ సభ్యులు పార్టీ మూలసూత్రాలనే ఉల్లంఘించే సందర్బంలో, మోతిలాల్‌గారే స్కీన్ కమిటీ సభ్యత్వం అంగీకరించగా లేనిది, మేము చేసింది ఏ విధంగా తప్పవుతుందో చెప్పమనడానికి అది వీలిచ్చింది. నిజంగా స్వరాజ్య పార్టీవారే గనుక సంపూర్ణ సహకార విధానాన్ని చేపట్టి ఉంటే వారు ఇతోధికంగా జయాన్ని సాధించి ఉండేవారు.

కొన్ని కొత్త స్కీములను ప్రవేశ పెట్టాలనే సదభిప్రాయంతో, సెంట్రల్ అసెంబ్లీ స్వరాజ్య పార్టీవారు చేసిన ప్రతిపాదనానుసారంగా ఏర్పడిన మడ్డిమన్ (MUDDIMAN) [2]కమిటీ సభ్యత్వం కూడా వారిని వరించి ఉండేది.

పూర్తి సహకార విధానానికి గనుక, దాస్-మోతిలాల్‌గారలు అనుమతించి ఉండి ఉంటే, వారినీ, వారి విధానాన్నీ, సహకార నిరాకరణ ఉద్యమ మూలసూత్రాలకే మోసం కలుగుతుందనే మిషమీద, కాంగ్రెసువారు త్రోసిపుచ్చేవారు. వారుభయులూ బాగా తెలివి గల

  1. మౌంట్ ఫర్డ్ సంస్కరణలు పనిచేస్తూన్న విధానం గురించి విచారించడానికి 1924 లో ఈ కమిటీ నియమించబడింది.
  2. శాండర్ట్స్(SANDHURST) కళాశాలతో సమానమైన ఒక సైనిక కళాశాల మన దేశంలో కూడా స్థాపించాలన్న ప్రతిపాదన సాధక బాధకాలు విచారించడానికి ఈ కమిటీ నియమించ బడింది.