పుట:Naajeevitayatrat021599mbp.pdf/295

ఈ పుట ఆమోదించబడ్డది

సి. ఆర్. దాస్ అతిథి మర్యాద

చిత్తరంజన్ దాస్‌గారు తన స్వంత రాష్ట్రంలోనే, రాజకీయ ప్రత్యర్థుల చేతిలో ఎల్లా యిరుక్కుని, ఎన్ని రకాలుగా బాధలు పడ్డారో, ఆర్థికంగా ఎలాంటి చిక్కులకు లోనయ్యారో కాస్త విచారిద్దాం. న్యాయవాదిగా సంపాదించడంలో గాని, సంపాదించినదంతా చాలక అప్పులుచేసి కూడా ఖర్చు పెట్టడంలోగాని, ఆయనకు ఆయనేసాటి. ఆయనా నాకుమల్లే చాలా దుందుడుకు మనిషి. నేను "స్వరాజ్య" పత్రిక స్థాపించిన కొత్తలోనే, ఆయన దక్షిణ దేశంలో పర్యటించడానికి వచ్చాడు. నా పత్రిక విజయవంతంగా ప్రజాదరణ పొందుతూన్న సంగతి గమనించి, ఆయన కలకత్తాలో "లిబర్టీ" అనే దైనిక పత్రిక స్థాపించారు. అదే దరిమిలా "ఫార్వర్డ్" పత్రిక అయింది. ఆయన చికాకులలో ఇరుక్కున్న రాజకీయ వాదులకు ఇతోధికంగానూ, ఉచితంగానూ సహాయాలు చేసెవాడు.

గాంధీగారు నన్ను "స్వరాజ్య" ను మూసివేయమని సలహా యిచ్చినప్పుడు, ఆయన నాతో దాస్‌గా రనుభవిస్తూన్న బాధలను గురించి కూడా వక్కాణించారు. ఏమయితేనేం, దాస్‌గారు మాంచి ఠీవితో బ్రతికి ఉన్నంతకాలమూ రాజాలాగే బ్రతికాడు. పోయిననాడూ[1]అంత ఠీవితోనే పోయాడు. ఆయన భోజనశాలలోని బల్ల (Dining Table) పెద్ద పెద్ద హోటేల్సు ఉండే బల్లలకంటే పెద్దది. డ్రెస్సులో ఉండే వెయిటర్సు కూడా ఒక పెద్ద హోటలులో ఉన్నంతమందీ ఉండేవారు.

ఆయన ప్రాక్టీసు విరమించక ముందు తరుచుగానూ, సహాయ నిరాకరణ ఉధ్యమంలో చేరాక మరీ యెక్కువగానూ ఆయనకు అతిథిగా ఉండేవాణ్ణి. ఉద్యమంలో చేరాక ఆయన తన ఖర్చులు తగ్గించుకుని, ఆ వెయిటర్లనీ వాళ్ల నీ తీసేసి, సాధారణంగా హిందువులు భుజించే పద్ధతిగా నేలమీద పీటలు వేసుకునే కూర్చునేవారు. ఆ ప్రకారంగా కూర్చో

  1. 16-6-1925.