పుట:Naajeevitayatrat021599mbp.pdf/231

ఈ పుట ఆమోదించబడ్డది

6

కేరళ రాష్ట్రీయ కాంగ్రెసు

తొలి సమావేశానికి అధ్యక్షత

నాగపూరు కాంగ్రెసులో ఆమోదింపబడిన ప్రతిపాదనల కారణంగానే కేరళ రాష్ట్రీయ కాంగ్రెసు సంఘంకూడా ఉద్భవించింది. ఆ కాంగ్రెసుచే ఆమోదింపబడిన మొదటి కాంగ్రెసు సంఘం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన దన్న సంగతి చదువరులకు తెలిసినదే. కేరళ రాష్ట్రీయ ప్రథమ కాంగ్రెసు సమావేశం ఒట్టపాలియంలో జరిగింది. మలయాళ మిత్రులు నన్ను అ సమావేశానికి అధ్యక్షత వహించవలసినదని కోరారు. జార్జి జోసాఫ్ ఇంకొకచోట అధ్యక్షత వహించవలసి వచ్చింది. అప్పటికి మలయాళదేశం కూడా చాలా ఉత్తేజపూరితంగానే తయారయింది. గాంధీగారి ముందడుగులో కేరళ రాష్ట్రీయ నాయకుల, సేవకుల శక్తి బాగా పుంజుకుంది. ఖిలాఫత్ ఉధ్యమానికి, స్వరాజ్యోద్యమానికి సన్నిహిత సంబంధం సమకూరడాన్ని, ఆ రోజులలో హిందూ-మహమ్మదీయ మైత్రి తారస్థాయి నందుకుంది. మలయాళ దేశపు అన్ని ప్రాంతాలనుండి ఆ సమావేశానికి ప్రతినిధులు వచ్చారు. ఈ రాజకీయ సమరంలో మలయాళ స్త్రీలు బాగా ముందంజ వేశారు. ఏ దృక్పథంనుంచి చూసినా యీ సమావేశం విజయవంతమయిందనే చెప్పాలి. హిందూ-మహమ్మదీయ సఖ్య సాధనకు సంబంధించిన ఫలితాలు మిన్నుముట్టాయి.

1921-22 సంవత్సరాలలో ఖాదీ ఉద్యమం బాగా సాగించగలిగిన జిల్లాలో మలబారు ఒకటి. అప్పట్లో హిచ్‌కాక్ అనే ఆయన అక్కడ జిల్లా పోలీసు సూపరింటెండెంటుగా వుండేవాడు. తాను ఆ జిల్లాలో ఉన్నంత కాలమూ అక్కడ రాజకీయ చైతన్యం తల ఎత్త కూడదనేదే ఆయన వాంఛ. మాప్లాల పరిస్థితి కదిపితే రాజుకునేటట్లుగా ఉండడాన్నే ఎక్కడ ఏవిధంగా కొంపలంటుకుంటాయో అన్న భీతికూడా ఆయనకు