పుట:Naajeevitayatrat021599mbp.pdf/219

ఈ పుట ఆమోదించబడ్డది

చేతిలో ఓడడం సంభవించే సరికి, కథ అడ్డం తిరిగింది. దాన్తో అనుకోని విధంగా అగ్నిరాజుకుంది. కొద్ది రోజులలోనే కొంప లంటు కున్నాయి. తుగ్లక్ రోజులలో కూడా జరుగనట్టి ఘోరపరిణామాలు జరిగిపోయాయి. ముల్లాన్‌లో కొట్లాటలు విజృంభించాయి.

ఈ సందర్బంలో నేను సేకరించిన వివరాలన్నీ వేరే శీర్షిక క్రింద విపులంగా విశద పరుస్తాను. ఒక్క విషయం మాత్రం పరమసత్యం. ముందుగా యోచించి వేసుకున్న ప్లాను ప్రకారంగా పట్నం నలుమూలలా ఒకేసారి అగ్నిజ్వాలలు లేచాయి. కుట్రదారులు ముందుగా ప్లాను వేసుకున్నారన్నది మాత్రం ఖాయం. ఏమయితేనేం 1922 లో గాంధీగారి నిర్బంధానంతరం వారి యోచనతో ప్రారంభింపబడ్డ హిందూ-మహమ్మదీయ ఐకమత్య సాధనికి మాత్రం గొడ్డలిపెట్టే అయింది.

లక్నోపాక్ట్ జరిగిన తేదీనుండీ జాతీయ దృక్పథం రాజబాటను వదలి గళ్ళీల ద్వారా ఉద్యోగాది అన్వేషణా విధానాలలో పడిపోయింది. గాంధీగారు నిర్బంధింపబడేవరకూ, లక్నోపాక్ట్ పున:పరిశీలన చెయ్యాలి అనే ఆందోళన పుట్టడానికే అవకాశం కలుగలేదు. సందు దొరికే సరికి ప్రభుత్వాధికారంలోనూ, పదవులలోనూ ఉద్యోగాలలోనూ ఉన్న పెద్దలే అనేక విధాల ప్రోద్బలం యిచ్చి, లక్నోపాక్ట్‌లో మార్పులు వచ్చి తీరాలి, మనకు యింకా ఎన్నెన్నో హక్కులు భుక్తం కాగల అవకాశాలు లభించాలి అనే నినాదాలూ, కోర్కెలూ వగైరా లేవనెత్తారు. అవి హద్దులుమీరి ఉద్దృతంగా విజృంభించాయి.

గాంధీగారి నిర్బంధంతోనూ వారికి విధింపబడ్డ అరు సంవత్సరాల కారాగార శిక్షకారణంగానూ, దాస్, మోతిలాల్, గాంధీజీల మధ్య ఉత్పన్నం అయిన భేదాభిప్రాయాలతోనూ కాంగ్రెసుకు దుర్దినాలు ఆరంభం అయ్యాయని ఒప్పుకోక తప్పదు. అప్పట్లోనే మేము మేల్కాంచి ముందు జాగ్రత్తలు తీసుకోవలసింది. శాంక్షన్ అయిన పదివేలూ కూడా ఎల్లాగయినా బాధితులకు అందజేసి ఉండవలసింది. కాని రాజగోపాలాచారిగారు అజాద్‌ను తమ పక్షానికి త్రిప్పుకోడానికి యిదే అదను అని భావించి, చేసిన కాలయాపన కారణంగా నిమిషాల