పుట:Naajeevitayatrat021599mbp.pdf/175

ఈ పుట ఆమోదించబడ్డది

వరకూ విఖ్యాతి వహించిన సురేంధ్రనాథ్‌బెనర్జీ మెల్లిగా వెనకబడ్డం ప్రారంభించాడు. కలకత్తాలో జాతీ యోద్వేగమే బాగా ప్రస్ఫుటం అయింది. ఆనాడు లోకమాన్యుడికి జరిగిన సమ్మానం కాంగ్రెస్ చరిత్రలో అపూర్వమైనది. జాతీయవాంఛ అయిన స్వరాజ్యంకోసం ప్రజలలో ఆవేశం ఎంత హెచ్చయిందంటే - ఆ సమయంలో మితవాద ప్రముఖుడై, బెంగాలులో ఒకప్పుడు అడ్డులేని నాయకత్వం వహించిన సురేంద్రనాథ బెనర్జీ మాట వినేవాళ్ళు కూడా లేకపోయారు.

కలకత్తా మహాసభకి మోహన్‌దాస్ గాంధీ హాజరు అయ్యాడు. దక్షిణాఫ్రికా సత్యాగ్రహ విజయానంతరం గాంధీ స్మట్సు రాజీ అయిన తరవాత. గాంధీ విజేత అయి ఈ దేశానికి వచ్చాడు. ఆయన లక్నో కాంగ్రెస్‌లో ఏ ప్రముఖస్థానమూ ఆక్రమించలేదు. విషయనిర్ధారణ సభా సభ్యత్వానికి జరిగిన పోటీలో ఓడిపోయినా, లోకమాన్యుడు ఆయన్ని గెల్పించాడు. ఆయన కలకత్తాలో గుడ్డ బొందుల చొక్కా వేసుకుని, ఫర్తు గుజరాతీ తలపాగాతో వేదికమీద కూర్చున్నాడు. అంతకిపూర్వం వెస్టు మినిష్టరు పాలెస్ హోటల్లో ఆయన్ని చూసిన నాకు ఈ అవతారం ఆశ్చర్యం కలిగించింది. ఆయన కప్పటికీ ఉపన్యాస ధోరణి కూడా బాగా లేదు. నెమ్మదిగా వినిపించీ వినిపించనట్లు మాట్లాడేవాడు. రాజకీయాల్లో అహింసా సత్యాగ్రహ సిద్ధాంతాల్ని గురించి అపూర్వమైన ప్రచారం ప్రారంభించినా, వంగదేశంలోని విప్లవవాదులు మహత్తరమైన దేశభక్తులే అనీ, కాని వారి దేశభక్తి వక్రమార్గం పట్టిందనీ బహిరంగంగా చాటగలిగాడు.

అందుచేతనే బిసెంటు ప్రభృతులికి కొంత ఆగ్రహం కూడా వచ్చింది. ఆయన అప్పటినించే భారత రాజకీయాల్లో కాలు నిలవదొక్కుకోడానికి ప్రారంభించాడు. కాని, ఆయన అచిరకాలంలోనే దేశంలో ఇంత ఆవేశం రేకేతిస్తాడనిగాని, వేలకివేల ప్రజల్ని ఈ మహా యజ్ఞంలో ఆహుతి చేయగలుతాడని ఎవరూ అనుకోలేదు. గుజరాతులోనూ, బీహారులోనూ ఆయన ధైర్యం వహించి నడిపించిన