పుట:Naajeevitayatrat021599mbp.pdf/170

ఈ పుట ఆమోదించబడ్డది

రంలోనే స్వర్గస్థుడు అయ్యాడు. క్రమంగా మితవాదుల పలుకుబడి జీర్ణించింది.

బిసెంటమ్మ ఆందోళన నన్ను బాగా ఆకర్షించింది. నేను అరందేలు, వాడియాల మోస్తరుగా ఆమె ఆంతరంగికుల్లోగాని, సి. పి. రామస్వామి అయ్యరుగారివంటి అభిమానుల వర్గంలో కాని ఎప్పుడూ చేరలేదు. అసలు అల్లాగ చేరడానికి సంకల్పించుకునే మనస్తత్వమే లేదు. అంతకు పూర్వం మితవాదుల కాంగ్రెస్ నడిచే రోజుల్లో హిందూ పత్రిక సంపాదకులుగా ఉండి అనేక కష్టనిష్ఠురాలకి లోనైన డి. సుబ్రహ్మణ్యయ్యరుగారితో నే నప్పుడప్పుడు ఇష్టాగోష్టి జరుపుతూ ఉండేవాణ్ణి. ఆయనకి ఆఖరు రోజులలో ఆరోగ్యం పాడయింది. కాని, నిష్కళంకమైన జాతీయవాది అవడంచేత ఎప్పుడూ ఆ ఆలోచనలోనే ఉండేవాడు. ఆయనే తరుచు నాతో నాయకుల ఆదర్శాలూ, చిత్తవృత్తులూ ఒక విధంగానూ, ప్రజల అవసరాలూ, ఆశయాలూ మరి ఒక విధంగానూ నడుస్తూ ఉన్నాయి అని అంటూ వచ్చేవాడు. బిసెంటమ్మ ప్రవేశంతో నాయకుల చిత్తవృత్తి కొంచెం ప్రజల వైపుకి మారిందని చెప్పాలి.

బొంబాయి రాష్ట్రంలో లోకమాన్యుడి ఆందోళనా, మద్రాసులో బిసెంటమ్మ కలిగించిన సంచలనమూ, యుద్ద తీవ్రతా, ఆ సందర్భంలో బ్రిటిష్ పాలకులు చూపిన నిరంకుశత్వమూ కలిసి జాతీయోద్వేగానికి కారణా లయ్యాయి. మితవాదులకి పట్టుగొమ్మ అయిన గోఖలే మరణంతో వాళ్ల పలుకుబడి కూడా క్షీణించింది. ఇంతే కాకుండా, రాజకీయ సంస్కరణలు కొన్ని వస్తాయనీ, అందునిమిత్తమై మాంటేగ్ ఈదేశం వస్తాడనీ బాగా వార్తలు వ్యాపించి ఉండడంచేత కూడా రాజకీయ వాతావరణంలో వేడి తీవ్రం అయింది.

లోకమాన్యుడు కారాగారంనించి రావడంతోనే దేశంలోని ప్రముఖులు కొందరు కాంగ్రెసు అతివాద, మితవాద కక్షలుగా చీలడం