ఈ పుట ఆమోదించబడ్డది

XIV

నను, ఆయనపట్ల ప్రజల అభిమానమున కెన్నడు కొదువలేదు. రాజకీయ రంగమున హాలాహలమును మ్రింగి నిర్వికారముగ నిలిచిన సదాశివు డాయన. అది ప్రకాశంగారి విశిష్టత. ఉదాత్తత, ఔదార్యము గూడు కట్టుకొనిన స్వర్ణహృదయ మాయనది. ఆయన పటిమ సాటిలేనిది. మన రాజకీయ రంగమున ఆయనదొక మహామానవ పాత్ర. బహుముఖ వైభవోజ్జ్వలమైన జీవిత మది. హిమాలయమువలె అత్యున్నతమైన, అతి గంభీరమైన, అక్షయ క్షమాపూర్ణమైన మహౌదార్య మూర్తి అయన. ప్రకాశము ప్రజల ఆప్త బంధువు. ఆంధ్ర ప్రజానీకమున ఆయన పలుకుబడి, అఖిలభారతమున జవహర్‌లాల్ పలుకుబడితో పోలిక చెప్పదగినది.

మన ప్రియ ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధిగారు ప్రకాశముగారిని "ఆధునికాంధ్ర ప్రదేశ పిత" అనియు, "మన జాతీయ ఉద్యమ ప్రముఖ నాయకులలో ఆయన ఒక" రనియు ప్రస్తుతించుట ఎంతయు సముచితముగ నున్నది. పేరునకు దగినట్లు ప్రకాశము ఆంధ్ర దిక్చక్రమున అనుపమోజ్జ్వల తారగ ప్రకాశించెను. ఆయన ఎల్లప్పుడు క్రొత్తబాటలనే తీర్చుకొనుచుండెను. ప్రజల భక్తి విశ్వాసములపై ఆయనకు గల ప్రభుత్వము గాఢమైనది, అగాధమైనది. కనుకనే ఆయనను గూర్చిన విమర్శను లేశమైనను ప్రజలు సహింపకుండిరి. స్వాతంత్ర్యము కొరకు ఆయన చేసిన త్యాగము మహనీయమైన దగుటచే, ప్రజలాయన లోపముల నెన్న నిరాకరించిరి. 1952 లో చెన్నరాష్ట్ర ఉభయ శాసన సభల సంయుక్త సమావేశమున ఉపన్యసించుటకు గవర్నరు అధికారమును ఆయన సవాలుచేయుట పెద్ద సంచలనము కలిగించినది. నాటి మంత్రులపై ఆయన తెచ్చిన అభియోగ