ఈ పుట ఆమోదించబడ్డది

ప్రస్తుతి

శ్రీయుతులు ఎం. శేషాచలం అండ్ కంపెనీ వారు కీర్తిశేషులు టంగుటూరి ప్రకాశం పంతులు గారి సమగ్ర జీవిత చరిత్రను నాలుగు సంపుటములుగా ప్రకటింప బూనుకొనుట ముదావహము.

మొదటి మూడు సంపుటములు ప్రకాశంగారు స్వయముగ రచించినవి. ఆ కథ 1940 - 41 వరకే సాగినది. అనంతర చరిత్రగల 'అనుబంధ సంపుటి' యను నాల్గవ సంపుటము పంతులుగారి సన్నిహిత అనుచరులగు శ్రీ తెన్నేటి విశ్వనాథముగారు రచించినది.

తెలుగు పాఠకులు హెచ్చుమంది ఈ సంపుటములను సంపాదించుకొని చదివి, ఇంటింట పదిల పరచుకొన గలుగుటకు అనువుగ ఒక్కొక్క సంపుటము వెల రూ. 2-50 లుగ నిర్ణయించిరి. ఆంధ్ర కేసరి శతజయంత్వుత్సవ పురస్కృతిగ ఈ గ్రంథమును ప్రకటించు చున్నందులకు ఈ ప్రకాశకులను నే నభినందించుచున్నాను.

తెలుగు మాటాడు ప్రజల ముఖ్య లక్షణములు ప్రకాశము పంతులుగారిలో పుంజీభవించినవి. రాజఠీవి గల పురుష సింహుడు ఆయన. పాత పద్దతులను అంటిపట్టుకొనని విప్లవవాది. ప్రాచీన దురాచార విరోధి. స్వాభావికముగ ఆయనది విప్లవ ప్రకృతి. 1953 లో ఆంధ్ర రాష్ట్రావతరము శుభసమయమున కారాగారములలో నుండిన బందీ లందరికి విమోచనము కలిగించుచు ఆయన చేసిన ఉత్తరువు చరిత్రాత్మకమైనది. ఆయనయెడల ప్రజల భక్తి విశ్వాసములు ఆయన వైయక్తిక గుణ వైభవ ప్రేరితములు. ఆయన పార్టీలు మారి