పుట:Naajeevitayatrat021599mbp.pdf/144

ఈ పుట ఆమోదించబడ్డది

బెంచీమీద ఉండేవాడు. విశేషమైన ప్రతిభ కలవాడు. ఆడవాళ్ళు - అందులోనూ కాస్త చక్కగా సింగారించుకున్నవాళ్ళు - బోనులోకి వస్తే ఆయన మనస్సు నిలకడగా ఉండేదికాదని ప్రతీతి. ఆకాలంలో కొందరు వకీళ్ళు ఆయనకోర్టులో కేసులు గెలవడానికి ఈ సూక్ష్మాన్నే కనిపెట్టారు. అందుచేత టంకసాలవీథిలో ఉన్న భోగంవాళ్ళు చాలామంది ఈ కోర్టులో సాక్షులైనారు! సి. పి. రామస్వామయ్యరుగారు ఆకాలంలో చురుకుగా ముందుకి వస్తూన్న వకీలు. ఆయనకి ఒరిజనల్‌ సైడులో పని బాగా ఉండేది. బోడాంకి ఆయన అంటే చాలా ఇష్టం. అనాటి సి.పి రామస్వామయ్యరు గారు తరవాత ఆ బోడాంకి ఒక శిలావిగ్రహం కూడా చేయించారు. నేటికి కూడా బోడాం అల్లాంటి గౌరవానికి ఎంత మాత్రం అర్హుడు కాడని నా విశ్వాసం. ఆరోజుల్లో అంతా కూడా అల్లాగే అనుకునేవాళ్ళు.

ఈరీతిగా పద్నాలుగుసంవత్సరాలు జడ్జీలతో కిందామీదా పడుతూ నా ఆత్మ గౌరవానికీ, వృత్తిస్వాతంత్ర్యానికీ భంగం రాకుండా బారిష్టరీ నడిపించాను. నేను పని ప్రారంభించిన కొద్దికాలానికి, ప్రముఖులైన లాయర్లతో ఆలోచించి, జడ్జీలని సరియైన పద్ధతిలో ఉంచడానికి పత్రిక ఒకటి అవసరమని తలచి, కె. రామచంద్రన్ దగ్గిర లాటైమ్సు అనే లాజర్నలు ఒకటి కొన్నాను. దానికి నేను ప్రధానసంపాదకుణ్ణి. బారిష్టరు దేవదాసు, మాధవన్నాయరు మొదలయినవాళ్ళు సహాయ సంపాదకులు. ఆ పత్రికలో జడ్జీలనిగురించి నిర్భయంగా వ్రాస్తూ ఉండేవాళ్ళము.

పి. ఆర్. సుందరయ్యరుగారిని గురించి వ్రాసినసందర్భంలో నామీద కంటెప్టు ప్రొసీడింగ్సువిషయం ఆలోచించినప్పుడు, మాధవన్నాయరుగారు చాలా గడబిడ పడ్డారు. ఆయన తన మామగారైన సర్ శంకరన్నాయరుగారి పలుకుబడితో గవర్నమెంటు ప్లీడరై, హైకోర్టుజడ్జీ కావా లనే ఆశలో ఉండేవారు. కనక అసలే భయపడి మిక్కిలి ఆదుర్దాతో స్వార్థానికి అడ్డురాకుండా తమపేరు సంపాదకవర్గంలోనించి తప్పించమన్నారు. వి.ఆర్. కృష్ణస్వామయ్యరుగారు హైకోర్టుజడ్జీ పనిలోనించి ఎక్జిక్యూటివ్‌కౌన్సిల రయినప్పుడు కూడా పత్రికలలో చాలా తీవ్రంగా