పుట:Naajeevitayatrat021599mbp.pdf/115

ఈ పుట ఆమోదించబడ్డది

శ్వరుడులా వుండే ఆయన ముఖవర్చస్సు ఈ నాటికి కూడా నా కన్నులకి కట్టినట్లుంది.

ఆ రోజులలో లండన్ ఇండియన్ సొసైటీ తరపున 'ఇండియా' అనే వారపత్రిక కూడా ప్రచురించబడుతూ ఉండేది. మేము ప్రముఖులైన భారతీయుల్ని రప్పించి, వారిచేత ఉపన్యాసాలు కూడా ఇప్పిస్తూ వుండేవాళ్ళము. ఒకసారి, "సురేంద్ర నాథ బెనర్జీని పిలవాలా! గోఖలేని పిలవాలా?" అనే మీ మాంస వచ్చింది. బెంగాల్ సివిలియన్ అయిన కాటన్‌కి సురేంద్రనాథ బెనర్జీ అంటే అభిమానం. బొంబాయి సివిలియన్ అయిన వెడ్డర్‌బర్న్‌కి గోఖలే అంటే ఇష్టం. చాలా దీర్ఘమయిన చర్చ అయిన తరవాత గోఖలేని ఆహ్వానించారు. అయితే గోఖలేని ముందు తను చెప్పబోయే ఉపన్యాసం వ్రాసి పంపమన్నారు. ఆయన అల్లాగే తన ఉపన్యాసం వ్రాసి పంపించాడు. అంతలో ఉండేది ఆ సంఘం స్వేచ్చ.

అ సమయంలో మా సంఘం తరపున లాలా లజపతిరాయ్‌గారు కూడా వచ్చారు. ఆయన్ని నేను శ్యాంజీ కృష్ణవర్మ ఇంట్లో కలుసుకున్నాను. మొట్ట మొదటి సందర్శనంతోనే నాకు ఆయన దేశభక్తి తీవ్రతా, ఆవేశమూ ప్రస్ఫుటం అయ్యాయి. ఆయన, "ఎన్నాళ్ళు మన దేశం ఇల్లాగ ఈ దాస్య బంధంలో పడి ఉండాలి?" అని ఎంతో ఆత్రంగా నిట్టూర్పు విడిచేవాడు. ఆయన మహారాష్ట్ర దేశీయుడు. సంపూర్ణ స్వాతంత్ర్య విప్లవవాది. బ్రిటిష్ పాలన అంటే పరమ ద్వేషి. హిందూ దేశంలో సాయుధ విప్లవం తీసుకురావాలనే విశ్వాసం కలవాడు. చాలా ధనవంతుడు. 'ఇండియన్ సోషియాలజిష్టు' అనే పత్రిక మంచి తీవ్రంగా నడుపుతూ ఉండేవాడు. హెర్బర్టు స్పెన్సరు అంటే ఆయనకి అభిమానం. స్పెన్సరు పేరిట లండన్‌లో భారతీయ విద్యార్థులికి విద్యార్థి వేతనాలు ఇచ్చేవాడు.

ఆయన దగ్గిర స్కాలర్‌షిప్ పుచ్చుకున్నవాడు ఆయన రాజకీయాల్లో పనిచెయ్యాలని బాండు వ్రాసి యివ్వాలి. నాకు కూడా ఆయన స్కాలర్‌షిప్ ఇస్తానన్నాడు. నేను నా మిత్రుడు ఒకడు వ్రాసినబాండు