పుట:Naajeevitayatrat021599mbp.pdf/100

ఈ పుట ఆమోదించబడ్డది

ఆస్తికి హక్కులేదని సలహా ఇచ్చాననీ ఒక పెద్ద కథ అల్లారు. సాంబశివరావు, అచ్యుతరామయ్యగార్లు ఆ కుర్రవాళ్ళని స్వయంగా మేజస్ట్రీటు జిళ్లేళ్ళ కృష్ణారావు పంతులుగారి దగ్గిరికి తీసుకుపోయి వాళ్ళచేత అఫిడవిట్ ఇప్పించారు. ఆరాముదయ్యంగారి కేసు సందర్బంలో విస్ దొరతో తన్ను గురించి ఏదో చెప్పానని ఆయనకి అనుమానం ఉండడంచేత నా మీద కొంచెం గుర్రుగా ఉండేవాడు. ఆ ప్రమాణ పత్రిక ముఖం చూస్తేనే నమ్మడానికి వీలులేని స్థితిలో ఉండడంవల్ల, స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు సరియైన చర్య తీసుకుంటారో తీసుకోరో అని డిస్ట్రిక్టు సూపరింటెండెంటు దగ్గిరికి వెళ్ళారు.

అప్పుడు డి. యస్. పి. సి. బి. కన్నింగుహాం అనుకుంటాను. ఆయనకి కూడా ఈ అభూతకల్పన ఆశ్చర్యంగా తోచి, రాజమహేంద్రవరం వచ్చి సబ్‌కలెక్టరు విస్‌తో సంప్రతించాడు. విస్ చిరాకుపడి "ఏమిటీ? ఎన్నికల్లో ఓడించడానికి ప్రయత్నంచేసి ఓడిపోయారా? ఇప్పుడిక అతన్ని ఉరితీయించడానికి ప్రయత్నిస్తున్నారా?" అన్నాడు. ఆపైన ఆ కథ అసంభవమనీ, నా శత్రువుల అభూతకల్పన అనీ, నా ప్రస్తావన లేకుండా కేసు ఇన్‌క్వయిరీ చెయ్యమనీ సలహా చెప్పాడు. నా దగ్గిరికి పోయి స్టేటుమెంటుకూడా తీసుకోమన్నాడు. కన్నింగ్‌హామ్ మా యింటికి వచ్చి ఈ సంగతులన్నీ అడిగాడు. నేను మొదటినించీ ఉన్నదంతా పూసగుచ్చినట్లు చెప్పాను. వీరంతా మునిసిపల్ వ్యవహారాలలో నాకు శత్రువు లయినదీ, ఆ శత్రుత్వం కారణంచేత కక్ష సాధిస్తున్నదీ అంతా సవిస్తరంగా చెప్పినతరవాత అతను పూర్తిగా తృప్తిపడి నన్ను ఇంక్వయిరీలోనించి తప్పించివేశాడు.

ఈ సందర్భంలో నా మిత్రుడైన కందుకూరి వెంకటరత్నం విషయంలో కూడా నాస్నేహితులు కొందరు బాధపడ్డారు. ఆ కుర్రవాడి శవం పంచాయతీ చేసే సందర్భంలో కందుకూరి వెంకటరత్నం కూడా పంచాయితీదారు. అప్పుడు ఈ పెరుమాళ్ళ రంగయ్య అతన్ని హత్యచేయించి ఉంటాడేమో అనే కథ వచ్చి నప్పుడు యాథాలాపంగా