ఈ పుట ఆమోదించబడ్డది

కోవలసిందిగా అయనను ప్రధాని ఆదేశించారు.

లేఖ తనకు చేరిన వెంటనే శ్రీ సరీన్‌ నాకు కబురంపారు. నేను హుటాహుటిని వెళ్లి, హైదరాబాద్‌లో రాజ్‌భవన్‌లో ఉన్న గవర్నర్‌ సలహాదారును కలుసుకున్నాను. గవర్నర్‌కు సలహాదారుగా సరీన్‌ హైదరాబాద్‌ వస్తూ తనకు కార్యదర్శిగా ఆకాశవాణి డిప్యూటి డైరెక్టర్‌-జనరల్‌గా ఉన్న శ్రీ అమృతలాల్‌ మెహతాను తీసుకువచ్చారు.

నేను వెళ్ళగానే శ్రీ సరీన్‌ నన్ను సాదరంగా రాజ్‌ భవన్‌లోని పచ్చిక బయలులోకి తీసుకు వెళ్లి అక్కడ కూర్చోపెట్టారు. అది 1973 ఏప్రిల్‌లోని ఒక సాయం సమయం. అక్కడ శ్రీ సరీన్‌, నేను, శ్రీమెహతా మాత్రమే ఉన్నాము. నాతో వచ్చిన నా శ్రీమతి కృష్ణ కుమారిని రాజ్‌ భవన్‌ వరండాలోనే కూర్చోపెట్టారు.

శ్రీ సరీన్‌ నా లేఖ చేతపుచ్చుకుని, దానిలో నేను పేర్కొన్న అంశాలన్నింటి పై నన్ను గుచ్చి గుచ్చి అడుగుతుండగా, శ్రీ మెహతా నా జవాబులను రాసుకుంటున్నారు. చివరికి శ్రీ వెంగళ రావు వంతు వచ్చింది. ఆయన అనుకూల అంశాలను నేను వివరించాను. ఆయన కార్యదక్షుడైన, చురుకైన రాజకీయ వేత్త అని, రెండు ప్రాంతాలవారు ఆయనను "తమ వాడు"గా పరిగణిస్తారని పేర్కొన్నాను.

"అయితే, వెంగళరావుకు పార్టీ ఎమ్‌.ఎల్‌.ఎల మద్దతు ఉన్నట్టు లేదు కదా! ఆయన సామాజిక వర్గానికి చెందిన శాసన సభ్యులను వ్రేళ్లపై లెక్కపెట్టవచ్చునేమో! మరి, అలాంటప్పుడు ఆయనను కాంగ్రెసుపార్టీ ఎలా అంగీకరిస్తుంది?" అని శ్రీ సరీన్‌ ప్రశ్నించారు. "మేడం గాంధి కనుక, వెంగళరావ్‌ ముఖ్యమంత్రి అని ప్రకటిస్తే, కాంగ్రెస్‌పార్టీ మొత్తం మళ్లీ ఎదురుచెప్పదు" అని నేను సమాధానం చెప్పాను! శ్రీ సరీన్‌ చిరునవ్వుతో