ఈ పుట ఆమోదించబడ్డది

అనగా, కేంద్ర ప్రభుత్వం హిందూకోడ్‌ బిల్లులో తనకు నచ్చని అంశాలు అనేకం వున్నాయని, ఆ విషయంలో ప్రధాని నెహ్రూతో తనకు అభిప్రాయాలు ఏర్పడ్డాయని, అందువల్లనే రాజీనామా చేయవలసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

"నవభారత రాజ్యాంగ రచనా బాధ్యతను మీకు అప్పగించాలని ప్రధాని నెహ్రూకు సూచించిన మహాత్మాగాంధికి భారతజాతి కృతజ్ఞత చెప్పాలి" అని నేను అనగా, ఆయన చిరునవ్వుతో....

"రాజ్యాంగ రచన పూర్తి కాకుండనే గాంధీజీ మృతి చెందడం దురదృష్టం (స్వాతంత్య్రం వచ్చిన అయిదున్నర నెలలకే గాంధీజీ హత్య జరిగింది). ఆయన జీవితాంతం పోరాడిన అస్పృశ్యతను మన రాజ్యాంగంలో శిక్షార్హమని పేర్కొనడం, దాన్ని ఆదేశిక సూత్రాలలో చేర్చడం పట్ల ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు". అని డాక్టర్ అంబేద్కర్‌ అన్నారు. (భారత రాజ్యాంగ పరిషత్తు ప్రథమ సమావేశం 1946 డిసెంబర్‌లో జరిగింది. 1947లో ఒక ప్రక్క రాజ్యాంగ రచన జరుగుతుండగానే స్వాతంత్య్ర ప్రదానం కూడా జరిగింది).

ఆయన అప్పుడు రాజోలు వెళ్లవలసివుంది. అందువల్ల, ఆయనకు "థాంక్స్‌" చెప్పి నేను వచ్చి వేశాను. ఈ ఇంటర్‌వ్యూను "ఆంధ్రపత్రిక" ప్రముఖంగా ప్రచురించింది.

రాజాజీతో ఇంటర్‌వ్యూ

నేను 1952-53లో విజయవాడ నుంచి వెలువడిన "ప్రతిభ" తెలుగువారపత్రికకు ఎడిటర్‌గా పని చేశాను. అప్పటిలో ఆంధ్రప్రాంతం మద్రాసు రాష్ట్రంలో వుండేది. దానికి రాజాజీ ముఖ్యమంత్రి. ఆయన పూర్తి