ఈ పుట ఆమోదించబడ్డది

జవాబు పాటించదగిందని నా అభిప్రాయం.

రాజీవ్‌ గాంధిపై ఎన్‌.టి.ఆర్‌. వ్యాఖ్య

Naa Kalam - Naa Galam Page 105 Image 0001
Naa Kalam - Naa Galam Page 105 Image 0001

ఒక సారి అప్పటి ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ ఎన్‌.టి.రామారావు ప్రధాని రాజీవ్‌ గాంధిని " దేశ ద్రోహి " అని నిందించారు. అది నాకు బాధకలిగించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు దేశ ప్రధానిని విమర్శించవచ్చుకాని, "దేశ ద్రోహి" అని ఎలా దూషిస్తారు? అది రాజ్యాంగ విరుద్ధం కాదా? శ్రీ ఎన్‌.టి.ఆర్‌. వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా? " అంటూ నేను ఆనాడు దేశంలోని కాంగ్రెసేతర ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాశాను. వారిలో ఎవ్వరూ స్పందించలేదు. ఒక్క కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణ హెగ్డే మాత్రం తాను ఆవ్యాఖ్యతో ఏకీభవించడంలేదని సమాధానం రాశారు.

పార్టీ మార్పిడులు

మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలలో అవి నీతి, పార్టీల మార్పిడి సమస్యలు తీవ్రమైనవి. వీటిలో పార్టీల మార్పిడి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య బద్ధమైన ప్రభుత్వాలను అశాంతి, అస్థిరత్వాలతో కదిపి, కుదిపి వేస్తున్నాయి. ఒక పార్టీ పట్ల అభిమానంతో, విశ్వాసంతో ఆ పార్టీ అభ్యర్థులను ఓటర్లు గెలిపిస్తే, వారిలో కొందరు తమ సభ్యత్వ కాలపరిమితి పూర్తిఅయ్యేలోగా రెండు మూడు పార్టీలు మారడం కద్దు. ఈ వ్యాధి పార్టీల మార్పిడి చట్టం రాకముందు మరీ ఉధృతంగా ఉండేది! ఈ ప్లేటు ఫిరాయింపుల వల్ల ఎన్నో ప్రభుత్వాలు కూలిపోతూ వచ్చాయి. ఈ ఫిరాయింపుల నిరోధానికి చట్టంతీసుకు రావాలని చాలా కాలాంగా ఆలోచనలు, ప్రయత్నాలు జరుగుతూ