ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీమత్పర దేవతాయైనమః మృచ్ఛకటికము ప్రథమాంకము. నాంది. మ. అహిమోకాళ్ళకు రెండుచుట్టలుగఁ బర్యంకంబు బంధించి లో నహముంద్రుంచి మనంబు వంచి విషయత్యాగంబు గావించి యా దహరాకాశమునం దనంతఁ బరమాత్మంజూచుచుం డత్త్వదృ ష్ఠి హరుండున్న సమాధినిష్ఠ మిము రక్షించుం దయావంతమై.

గీ. గొరిచేతులగాటంపుఁ గౌఁగిలింత ♦ మెఱపుగాన్పింపదను మేటి కొఱఁతఁదీర్చ నీలమేఘముతోఁబోలు దాలుగల్గు ♦ కాలకంఠుని గళము మిమ్మేలుఁగాత.

(నాంద్యంతమున సూత్రధారుఁడు) చాలుఁజాలు. సభాసదుల కుల్లాసము గలుగఁ జేయని పరిశ్రమమేల? పూజ్యులగు పండితులార మీకొక విన్నపము. మేము తెనుఁగున మృచ్ఛకటికమును ప్రకరణము నభినయింపఁదలఁచి యున్నారము. ఆ నాటకము సంస్కృతమున నొనర్చిన యతఁడు - గీ. పూర్ణచంద్రాననుండు ప్రభూతకీర్తి ♦ ద్విజుల తలమానికము మదద్విరధగామి రాచతబిసి చకోరవిలోచనుండు ♦ శూద్రకుండను కవిరాజు సుందరుండు. సీ. చదివె ఋగ్వేదంబు సామవేదము గణితంబు వైశికవిద్య దంతిశిక్ష కాంచెఁ బర్వతకన్యకాభర్తదయచేతఁ దిమీరంబువాసిన దివ్యదృష్టిఁ బడసె వసుంధరాపాలనాచాతుర్యమునఁ దనయంతవానిని గుమారుఁ దనియించె నశ్వమేధముచేసి మేటి దక్షిణలచే సురలను క్షితిసురులను గీ. నప్రమత్తుండు సంయుగవ్యసని, శత్రు ♦ గజములంగూల్చు చేలావు గలుగువాఁడు బ్రదికె నూఱేండ్ల పై నొక పదిదినములు ♦ వ్రాల్చె మేనగ్నిలోన శూద్రక విభుండు. చ. సరసగుణాభిరాముఁడు ప్రశస్తయశస్సురభీభవద్దిగం తరుఁడు గభీరుఁ డున్నతుఁ డుదారుఁడు ధీవరుఁడైన కృష్ణభూ వరుని కవీంద్రులై రెవరు ప్రస్తుతమందు శతావధానులే తిరుపతివేంకటేశ్వరులు తెల్గొనరించిరి వారు దానికిన్. ఈ నాటకమునందలి కధ యేమనగా. గీ. బ్రాహణుఁడు పేదవడిన వ్యాపారిపడుచు చారుడత్తుఁడనంగ నుజ్జయినిఁ గలడు, కలదు వేశ్యయొకర్తు చక్కఁదనమున వసంతశోభను బోలు వసంతసేన.