ఈ పుట ఆమోదించబడ్డది

ధీవరులు గాని జాతినిందితులు గారు
పరమవావను లావురి ధరిణిసురులు. 9
ఉ. రాజులు కాంతియందు రతిరాజులు రూపుమునందు వాహినీ
రాజులు దనమందు మృగరాజులు విక్రమకేళియందు గో
రాజులు భోగమందు దినరాజులు సంతతతేజమందు రా
రాజులు మానమందు నగరమ్మున రాజకుమారు లందఱున్

సీ. తగ చానవిఖ్యాతి ధరుఁగుబేరులు గాని
సతాతాంగకుష్ఠపీడితులు గారు
నిర్మలసత్యోక్తి ధర్మసూతులు గాని
చర్చింప ననృతభాషకులు గారు
ప్రకటవిభూతిసౌభాగ్యరుద్రులు గాని
వసుధపై రోషమానసులు గారు
కమనీయగాంభీర్యఘనసముద్రులు గాని
యతులితభంగసంగతులు గారు

తే. వర్తకులు గాని పక్షు లేవరునఁ గారు
భోగులేకాని పాము లెప్పుడును గారు
సరసులే కాని కొలఁకులజాడఁ గారు
వన్నె కెక్కినయప్పురి వైశ్యు లెల్ల.

క.పంటల భాగ్యము గలరై
పంటలపైఁ బంట లమర బ్రతుకుదు రెపుడున్
బంటులుఁ బాడియుఁ గలయా
పంటలు మొదలైన కాఁపుబ్రజలానగరిన్.

సీ. కలికిచూపుల చేతఁ గరఁగింప నేర్తురు
బ్రహ్మచారులనైన భ్రాంతి గొలిపి