ఈ పుట ఆమోదించబడ్డది

బాలకాండము

   మోహనగణికాసమూహగేయము గాని
      యూధికానికరసంయుతము గాదు

తే. సరస సత్పుణ్యజననివాసమ్ము గాని
   కఠిననిర్దయదైత్యసంఘమ్ము గాదు
   కాదు కాదని కొనియాడఁ గలిగినట్టి
   పురవరాగ్రమ్ము సాకేతపురవరమ్ము.

సీ. భూరివిద్యాప్రౌఢి శారదాపీఠ మై
     గణుతింప సత్యలోకమ్మువోలె
   మహనీయగుణసర్వమంగళావాసమై
     పొగడొందుకైలాసనగమువోలె
   లలితసంపచ్ఛాలిలక్ష్మీనివాసమై
     యురవైనవై కుంఠపురమువోలె
   విరచితప్రఖ్యాతహరిచందనాఢ్యమై
     యారూఢి నమరాలయమ్మువోలె

తే. రాజరాజనివాసమై తేజరిల్లి
   నరవరోత్తరదిగ్భాగనగరివోలె
   సకలజనములు గొనియాడ జగములందుఁ
   బొలుపుమీరును సాకేతపురవరమ్ము.

క. ఇమ్ముల నప్పురి వప్రము
   కొమ్ములపై నుండి పురముకొమ్ములు వేడ్క౯
   దమ్ములచుట్టముపదజల
   జమ్ములు పూజింతు రొగి నజస్రముఁ బ్రీతి౯.

క. పరువున మురువై యుండును
   సురపురమునఁ గల్పతరులు చూపఱ కింపై