ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

బాలకాండము

---


సీ. సరయూనదీతీరసతతసన్మంగళ
      ప్రాభవోన్నతమహావైభవమ్ము
   కనకగోపురహార్మ్యఘనకవాటోజ్జ్వల
      త్ప్రాకారగోపురశ్రీకరమ్ము
   గజవాజిరథభటగణికాతపత్రచా
      మరకేతుతోరణమండితమ్ము
   ధరణీవధూటికాభరణవిభ్రమరేఖ
      దరిసించుమాణిక్యదర్పణమ్ము

తే. భానుకులదీపరాజన్యపట్టభద్ర
   భాసినవరత్నఖచితసింహాసనమ్ము
   నాఁగ నుతి కెక్కు మహిమ ననారతమ్ము
   ధర్మనిలయమ్ము మహి నయోధ్యాపురమ్ము.

సీ. మదనాగయూథసమగ్రదేశము గాని
      కుటిలవర్తన శేషకులము గాదు
   ఆహవోర్వీజయహరినివాసము గాని
      కీశసముత్కరాంకితము గాదు
   సుందరస్యందనమందిరం బగుఁ గాని
      సంతతమంజుళాశ్రయము గాదు