పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/179

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

మీఁగడ తఱకలు


గను. మీ ప్రార్ధనవల్ల నాకొఱఁత తెలిసికొని, నాయంతర్యామినిఁ బరమాత్ముని వేఁడి నేఁ డాప్రజ్ఞను బడసి మీకు బదులు చెప్పఁ గల్గుచున్నాను. ఇది నాకుఁ గావలె నని యడుగనేరనివానికి, దానిలేవడి వలని యిబ్బందిని గుర్తింపనివానికి నేది గాని లభింపదు. అట్టివాని కేది యిచ్చినను దానిని వాఁడు సరిగా ననుభవింపఁజాలఁడు. కాన యీతని కేదియు నీయవీలు లేదు. తనకొఱఁతల నాతఁడు గుర్తించి యర్ధించుఁ గాక యనెను. ఆతఁడు యోచించుచుండెను. భక్తుఁడు ప్రార్థించెను. నీ వెవరవమ్మా! కల్పవృక్షము నీవేనా? నేను కల్పవృక్షమనే. నీ ప్రార్ధన లాలకించి, నాయంతర్యామిని సర్వాంత ర్యామి యీశ్వరుడు కోరికలు దీర్పఁబంపెను. కోరుము అనెను. ఆనందపరవశుఁడై "అమ్మా! ఇఁక నిన్ను విడువఁజాలను. మునుముందుగా ఈపని గావింపుము. నన్ను నమ్మక మీఁది గ్రామమునకు దూకినవాc డేమి సంకటములో నున్నాఁడో, వాని నిటకు దెప్పింపుము". కల్పవృక్షము మీఁదియూరు చేరలేక స్మృతిదప్పి త్రోవలోఁ బడియున్న వానిని రాల్చెను. స్మృతి లేదు. వానికిఁ బ్రాణము పోయు మని భక్తుడు వేఁడెను. అయ్యా! ఇది నావల్లఁ గాదే యని వణఁకుచు నంతర్యామి నర్ధించి దానిని గొని తెచ్చివాని కిచ్చెను. పాలలోఁ బంచదార కలసిపోయినట్లు నీవు నాలోఁ గలసి పోయి నారూపముననే నెలకొనుము, కల్పవృక్షము అన్ని కోరికలను దీర్చినది యన్న ప్రసిద్ధి నిలుపుకొనుమా యని భక్తుఁ డనెను. ఎన్నఁడు నెవ్వరును గోరనిగోరికలు కోరుట జరుగుచున్నదే యని యచ్చెరువు చెంది యది యంతర్యామి నడిగి యిట్లు బదులు చెప్పెను. "నేను నీలో నైక్య మందుదును గాని నీవు ప్రపంచ ప్రాణికోటితో నైక్య మందవలెను. మానవతలో నేప్రాణినిగాని నీవు వేఱుపఱుపరాదు. ఏభాగమున నీవు వేర్పాటు పాటింతువో ఆభాగమున నే నుండ వీలుండదు" సర్వపరిపూర్ణత గోచరించి భక్తుఁడు వల్లె యని పరమానందభరితుఁడై చెట్టును గౌఁగిలించుకొనెను. చెట్టు మాయ మయ్యెను. చెట్టు మాయమగుట చూచి చావు దప్పించుకొన్న