పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/105

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

మీఁగడ తఱకలు


రచించినది సంగీతసూర్యోదయ మని యొకసంస్కృతగ్రంథ మిప్పుడు దొరకినది. దానిపీఠికలో విద్యానగరము, కృష్ణరాయల దిగ్విజయములు వర్ణితము లయినవి. రాయల దిగ్విజయవర్ణనములలో నపూర్వవిషయము లొండు రెండు గానవచ్చుచున్నవి. సంగీతసూర్యోదయకారునకు నభినవభరతాచార్య, రాయబయకార, తోడరమల్ల, సూక్ష్మభరతాచార్య బిరుదములు గలవు. కృష్ణరాయ లీయనకు బంగారుపల్లకీ, ముత్తెసరుల జల్లులు గలవి రెండు ముక్తాతపత్రములు, మదపుటేనుఁగులు, మలహరీవాద్యము నొసంగెను. ఈయన విష్ణుభట్టారకులయొద్ద దత్తిల కోహలాది భరతమతగ్రంథములను సవ్యాఖ్యముగా నధ్యయనము చేసినాఁడు. తాళాధ్యాయము, నృత్తాధ్యాయము, స్వరగీతాధ్యాయము, జాత్యధ్యాయము, ప్రబంధాధ్యాయము నని యయిదధ్యాయములతో నీతఁడు సంగీతసూర్యోదయము రచించినాఁడు. ఈయన గ్రంధావతరణిక నుండి కొన్ని శ్లోకములు.

శ్లో|| కర్ణాటాహ్వయదేశసౌఖ్యజననీ శ్రీతుంగభద్రావృతా
      మాతంగోన్నతమాల్యవత్ క్షితిధర శ్రీహేమకూటాన్వితా
      పంపాధీశ్వరవిట్ఠలేశ్వరకృపాదృష్టి ప్రభామండితా
      శ్రీవిద్యానగరీ విభాతి ధరణీధమ్మిల్ల మాణిక్యవత్
             * * * * *
శ్లో|| బాల్యే ౽ సౌ సకలకలాకలాపయుక్త
      స్సప్రా(త్రా?)ణం సపది విజిత్య గంగరాజం
      భఙ్త్య్వౌ తచ్చివనసముద్ర ముత్కటం ద్రా
      గావాసం వ్యతనుత నిర్భరం శివానామ్.

శ్లో|| దుర్గం జిత్వా థ సో౽ సా వుదయగిరివరం తత్ర రాహుత్తరాజం
      బందీకృ త్వాశుహృత్వా యుధి నగరవరే కొండవీడ్కొండపల్ల్యౌ
      జీవగ్రాహం గృహీత్వా గజపతితనయం పొట్టునూర్పట్టణాగ్రే
      విశ్వశ్లాఘ్యప్రతాపో బిరుదయుతజయ స్తంభ ముచ్చై ర్ద్యఖానీత్,