ఈ పుట ఆమోదించబడ్డది

చేకూర్చునదా, చెడును చేకూర్చునదా అని యోచించకనే దానిని తప్పుగా ఎలా భావించారు? ఒకవేళ చట్టరీత్యా ఇది తప్పేనని న్యాయస్థానము నిర్ణయిస్తే, దానికి వందో రెండువందలో జరిమానా విధించవచ్చును కానీ అదేదో పెద్దనేరమైనట్లు నాలుగువేల రూపాయలను జరిమానా విధించడము, డబ్బును కట్టలేకపోతే 20 రోజులు జైలుశిక్ష వేయడము సబబేనా అని ప్రశ్నించు చున్నాము. అదే నేరమైతే అది అంత పెద్ద శిక్షార్హమైతే క్రైస్తవుల చర్చీల ప్రహారీ గోడల చుట్టూ ప్రభువే నిజమైన దేవుడని, ప్రభువు పాపులను రక్షించునని అనేకమైన బైబిలు వాక్యములు వ్రాసియుంటారే అది కూడ చట్టము ప్రకారము తప్పేకదా! ఒకవేళ క్రైస్తవుడే న్యాయాధిపతిగాయుండి దానిని తప్పని వ్రాసిన క్రైస్తవులకు జైలుశిక్ష విధిస్తే క్రైస్తవులు ఆ న్యాయాధిపతిని వారి మతమునుండే వెలివేస్తారు. గతకాలములో బర్నాలా అను సిక్కు ముఖ్యమంత్రిగాయున్నపుడు చట్టమని సిక్కులకు వ్యతిరేఖమైన పని చేస్తే సిక్కు గురువులు ముఖ్యమంత్రిగా యున్న బర్నాలాకు శిక్షవేసి వారి స్వర్ణదేవాలయము ముందర వచ్చిపోయే భక్తుల యొక్క చెప్పులకున్న దుమ్ముతుడిచేటట్లు చేశారు. ఇతర మతములలో పెద్ద జ్ఞానములేకున్నా వారు ఎంతో క్రమశిక్షణతో దేవుని ఎడల ప్రవర్తిస్తుంటే హిందువులెందుకు ఇలా దిగజారిపోతున్నారు? ఎలక్షన్‌ సమయములో కనపడిన గోడల విూదంతటా వ్రాసే నాయకుల విూద కేసులు పెట్టలేని విూరు భగవద్గీత వాక్యమును తప్పుగా భావించి కేసులు పెట్టడము, ఆ వ్రాతను అసభ్యకరమైనవని న్యూస్‌పేపర్లకు ఎక్కించడము మంచిదేనా? హిందూమతమును రక్షించే మీరే యోచించుకోండి.

మేము చేసిన ప్రచారము హిందువులు చెడుగా గుర్తించారని, శిక్షలు వేయించారని తెలుసుకొన్న ఇతర మతములలో ఒక మతమువారు మావద్దకు వచ్చి "విూ మతములో జ్ఞానములేదని ఇప్పటికైనా ఒప్పుకుంటారా" అని