ఈ పుట అచ్చుదిద్దబడ్డది

61

పడక విరోధముగా నుండిరనుకొనుము. వారిద్ద రేకీభవించినగాని మీగ్రామమునందు నెమ్మదిగలుగదనుకొనుము అట్టి సమయమున నీవేకాంతస్తలమునకుబోయి వారిద్దరిని మనసు నందు తలంచుచు “మీరిద్దరొకరినొకరిని ప్రేమించుకొనుచుందురుగాక. నేటినుండియు నామనోశక్తి ప్రభావముచే మీకిద్దర కమితమిత్రత్వము గలుగును” అని ప్రతిదినమును సుమారొక వారమువరకు నీమనోశక్తి నుపయోగించిన వారిద్దరును మిత్రులగుదురు. అందువల్ల మీగ్రామవాసుల కెంతయు మహోపకార మొనర్చినవాడి వగుదువు గాన చదువరులారా! సమస్త ప్రాణికోటులయందును మనుజుడే యుత్తముడని పరిగణింపబడినందులకు నెద్దియైన నొకపెద్దమహిమను పిన్న పెద్దలందరు బుద్ధికుశలతగలవారై సంపాదింపకుండిన మానవజాతికంతకును మిక్కిలి యవమానకరమైన విషయమైయున్నది. ప్రపంచమునందు ప్రతివారికిని మిక్కిలి సహాయపడునది మనోశక్తి దక్క రెండవదిగాదని చదువరులకెల్లరకును తెలియవచ్చుచున్నది. మనపూర్వీకులెల్లరును యిటువంటి మనోశక్తి ప్రభావముచే మిక్కిలి యద్భుతకార్యములను పెక్కింటిని జేసియున్నారు. అట్టి మహానుభావులగువారిరి రక్తమునుండి జననమంది మిక్కిలి యాదరింపబడిన మనోశక్తిని సంపాదించుటకు ప్రయత్నింపకుండ సోమరులవలె కాలమును వృధాబుచ్చు నీచుల నితరదేశస్థు లెట్లు గౌరవింతురు? వారివల్ల గౌరవమును పొందుటట్లుంచి తమదేశమునందు జనించువారి నెల్లరను సోమరిపోతులను జేయుచున్నారే? ఎంతటి ఘోరపాపము! గాన