ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51

విషయమునుగురించి బాగుగ విమర్శించి చూచిన మీకుగూడ నట్లేగానుపించినపుడైనయనుకొనక మానరనితలంచుచున్నాను.

ఈ మనోశ క్తిని సంపాదించుటకు ప్రతిదినమును సూర్యోదయమునకు పూర్వమేలేచి నిత్యకృత్యములనుసల్పి పిమ్మట స్నానమాచరించవలెను. ప్రవహించుచున్న కృష్ణ, గోదావరి, గంగ, సింధునదులలోగాని, వాటి యుపనదులలోగాని లేక నట్టి యుపనదులనుండి త్రవ్వబడిన కాలువలలోగాని లేక నెటువంటి పారుడునీటియందుగాని స్నానముచేయుట మిక్కిలి శ్రేయస్కరము. పారుడునీటియందొక శక్తియున్నది. మన పూర్వీకులు జ్ఞానాధిక్యము గలవారు గనుకనే యెల్లనదులను మిక్కిలి పూజనీయముగానెంచి యేటేట నదీదేవతలకు మ్రొక్కునట్లేర్పాటు జేసియుండిరి. కాని యేబావికిని మ్రొక్కునట్లేర్పాటుజేసియుండలేదని హిందూజాతికంతకును విశదమైయున్నది. కాన నదీజలమునందు జలకమాడుట చాలమంచిదని నాయభిప్రాయము. కదలికలేక చెడువస్తువు లెల్లను క్రుళ్ళి వేలకొలది పురుగులు నీటియందంతయును మనకనులకు గానరానంత చిన్నవిగా నావరించి చూచుటకుమాత్రము బాగుగ నున్నను కదలికలేని నీటియందు జలకమాడుట మంచిదిగాదని ప్రపంచజ్ఞానముగలవారందరకును తెలియును. అహో, కొన్నికొన్ని గ్రామములకు కాల్వల వసతులుగాని లేక రెండవ పక్షమున బావులవసతులుగాని లేని హేతువుచే చెఱువుల యందునీటిని వాడుకొనువారి సౌఖ్యమేమనిచెప్పవచ్చునో చదువరులే గ్రహింతురుగాక.